ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెసెంజర్‌లో వాట్సాప్‌ చాట్స్‌!

ABN, First Publish Date - 2021-04-24T07:11:48+05:30

వాట్సాప్‌, మెసెంజర్‌ను ఫేస్‌బుక్‌ కలిపేస్తోందని అనధికార వర్గాల సమాచారం. టెస్టింగ్‌ కూడా జరిగిందని డబ్ల్యూఏబేటాఇన్ఫో తెలిపింది. ‘ఫేస్‌బుక్‌ మెసెంజర్‌’లో హిడెన్‌గా ఉన్న వాట్సాప్‌ చాట్‌ ఫీచర్‌ను కనుగొన్నట్టు టిప్‌స్టర్‌ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌, మెసెంజర్‌ను ఫేస్‌బుక్‌ కలిపేస్తోందని అనధికార వర్గాల సమాచారం. టెస్టింగ్‌ కూడా జరిగిందని డబ్ల్యూఏబేటాఇన్ఫో తెలిపింది.  ‘ఫేస్‌బుక్‌ మెసెంజర్‌’లో హిడెన్‌గా ఉన్న వాట్సాప్‌ చాట్‌ ఫీచర్‌ను  కనుగొన్నట్టు టిప్‌స్టర్‌ వెల్లడించారు. అయితే ఈ రెంటినీ కలిపేస్తున్నట్టు ఫేస్‌బుక్‌ మాత్రం అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ ఇది పూర్తిగా ఆప్షనల్‌ అని మాత్రం పేర్కొంటున్నారు. ఇది చాలా క్లిష్టమైన ఫీచర్‌ అని, ఉనికిలోకి వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటుందని డబ్ల్యూఏబేటాఇన్ఫో వివరించింది. 


అసలు ఈ రెంటినీ కలిపేసే ఫీచర్‌ను బయటకు తెస్తుందా, లేదంటే పూర్తిగా విడిచిపెట్టేస్తుందా అన్నది చెప్పలేమంది. వాట్సాప్‌ మెసేజ్‌లు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటాయి.  ముందు వాటి డిక్రిప్ట్‌, ఎన్‌క్రిప్ట్‌ కోసం ఫేస్‌బుక్‌ ‘సిగ్నల్‌’ ప్రొటోకాల్‌ను ఇంపోర్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా వాట్సాప్‌ సరికొత్త అప్‌డేట్‌లు చేసింది. మొదటిది ఫొటోలను ఓపెన్‌ చేయకుండానే ప్రివ్యూ చూడవచ్చు. ఐఓఎస్‌తో ఇప్పుడు ఫొటోలను పెద్దగా చేసుకుని చూసే అవకాశం కలుగుతుంది. రెండోది గ్రూప్‌లోని మెంబర్లు అదృశ్యమైన మెసేజ్‌లకు సంబంధించి సెట్టింగ్స్‌ మార్చవచ్చు. ఈ వెసులుబాటు ఇంతకుమునుపు గ్రూప్‌ అడ్మిన్‌లకు మాత్రమే ఉండేది.

Updated Date - 2021-04-24T07:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising