ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడుస్తూ ఫోన్‌ చూస్తే వార్నింగ్‌!

ABN, First Publish Date - 2021-04-17T06:11:30+05:30

మీరు నడుస్తున్నప్పుడు ఫోన్‌వైపు చూస్తే చాలు.... తలెత్తి ముందు చూడు చూడు అంటూ అలర్ట్‌ చేసే విధానాన్ని గూగుల్‌ అభివృద్ధిపర్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు నడుస్తున్నప్పుడు ఫోన్‌వైపు చూస్తే చాలు.... తలెత్తి ముందు చూడు చూడు అంటూ అలర్ట్‌ చేసే విధానాన్ని  గూగుల్‌  అభివృద్ధిపర్చింది. గూగుల్‌ ఇందుకోసం తన ‘డిజిటల్‌ వెల్‌బీయింగ్‌’లో ‘హెడ్స్‌ అప్‌’ ఫీచర్‌ను ఉంచుతోంది. దీంతో బీకేర్‌ఫుల్‌, లుక్‌ ఎహెడ్‌,  స్టే ఫోకస్డ్‌, లుక్‌ ఆప్‌, స్టే అలర్ట్‌, వాచ్‌ ఔట్‌, వాచ్‌ యువర్‌ స్టెప్‌ వంటి అలర్ట్‌లు అందుతాయి. వెల్‌బీయింగ్‌ యాప్‌లోని హెడ్స్‌ అప్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకుంటే ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మొదట లొకేషన్‌ పర్మిషన్‌ను అది అడుగుతుంది. ఫిజికల్‌ యాక్టివిటీ తెలియజేసి ఓకే చెబితే అది అలర్ట్‌ చేసే పనిలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే రోడ్డు మీద సురక్షితంగా నడిచేందుకు ఉపయోగపడుతుంది. యాప్‌ బేటా వెర్షన్‌ను గూగుల్‌ విడుదల చేసింది. పిక్సల్‌ 4ఎ, పిక్సల్‌ 5లో దీనిని చూడవచ్చు. ఆండ్రాయిడ్‌ డివైజెస్‌లలోనూ త్వరలో సాక్షాత్కరించనుంది. ఇప్పటికీ ఈ ఫీచర్‌ కనిపించకుంటే, వినియోగదారులు తమ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలోని వెల్‌బీయింగ్‌లోకి వెళ్ళి యాప్స్‌ ఇన్‌ సెట్టింగ్స్‌ కింద దీన్ని చూడవచ్చు.

Updated Date - 2021-04-17T06:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising