ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ టెలిస్కోప్ విలువ 145 మిలియన్ డాలర్లు.. ఇక నక్షత్రాల గుట్టు వీడడం ఖాయం!

ABN, First Publish Date - 2021-10-20T00:33:34+05:30

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంతరిక్షంలో మోహరింపునకు రెడీ అయిన వేళ.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంతరిక్షంలో మోహరింపునకు రెడీ అయిన వేళ.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో పెద్ద అబ్జర్వేటరీ కోసం సిద్ధమైంది. నక్షత్రాల పుట్టుక, వాటి మరణం, పాలపుంతలో రసాయన మూలకాల నిర్మాణం వంటివాటి గురించి అధ్యయనం చేసేందుకు ఓ పెద్ద టెలిస్కోప్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి డిజైన్, అభివృద్ధి ప్రతిపాదనకు నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఖగోళ భౌతికశాస్త్ర మిషన్‌లో భాగంగా ఈ గామా కిరణాల టెలిస్కోప్‌ను 2025లో లాంచ్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం 2019లో 18 టెలిస్కోప్ ప్రతిపాదనలు రాగా, మిషన్ కాన్సెప్ట్ స్టడీస్ కోసం నాలుగు ఎంపికయ్యాయి.


వీటని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించిన తర్వాత కాంప్టన్ స్పెక్టోమీటర్ అండ్ ఇమేజెర్ (సీవోఎస్ఐ)కు దశలవారీ అభివృద్ధి కోసం నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మిషన్‌కు అయ్యే ఖర్చును 145 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. రాబోయో రోజుల్లో నాసా లాంచ్ పార్ట్‌నర్‌ను ఎంపిక చేస్తుంది.  

Updated Date - 2021-10-20T00:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising