ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త వెర్షన్లలో నిల్‌ సదుపాయాలు!

ABN, First Publish Date - 2021-01-09T06:37:16+05:30

ఆ విషయం చర్చించుకోబోయేముందు అన్నింటికన్నా ప్రధానంగా ఆండ్రాయిడ్‌ అనేది మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అని గుర్తుంచుకోవాలి. మన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్లు వచ్చినా  పెద్దగా చెప్పుకోదగ్గ సదుపాయాలు ఎందుకు రావట్లేదో తెలుపగలరా?        -

రాజశేఖర్‌, విజయవాడ

ఆ విషయం చర్చించుకోబోయేముందు అన్నింటికన్నా ప్రధానంగా  ఆండ్రాయిడ్‌ అనేది మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అని గుర్తుంచుకోవాలి.  మన ఫోన్లో అంత పెద్ద మొత్తంలో ర్యామ్‌, అన్ని సిపియు కోర్‌లు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం.  వాస్తవానికి డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు,  లాప్‌టాప్‌ లతో పోలిస్తే  మన స్మార్ట్‌ఫోన్లు కనీసం 30-40 శాతం కూడా  ప్రాసెసింగ్‌ పవర్‌ని కలిగి ఉండవు.  దీనికి ప్రధానమైన కారణం మొబైల్‌ ఫోన్‌ కోసం చిప్‌సెట్‌  తయారు చేయాలంటే తగినంత స్థలం నుంచి అది  వేడెక్కకుండా జాగ్రత్త తీసుకోవటం వరకూ  అనేక అంశాల మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది. 


కంప్యూటర్‌ మాదిరిగా స్మార్ట్‌ఫోన్లో సిపియు ఫ్యాన్లని  అమర్చడానికి సాధ్యపడదు.  ఇలా అనేక పరిమితులు ఉండబట్టి ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తయారు చేసే  గూగుల్‌ సంస్థ కూడా డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో మాదిరిగా పెద్ద మొత్తంలో సదుపాయాలను  కొత్త ఆండ్రాయిడ్‌ వెర్షన్లలో నిక్షిప్తం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది.  అప్పటికి ఎంతో ఆప్టిమైజ్‌ చేసి  తక్కువ మొత్తంలో బ్యాటరీ, ప్రాసెసింగ్‌ పవర్‌ వాడుకునేలా ఆండ్రాయిడ్‌ని తీర్చిదిద్దుతూ ఉంటుంది.  

సెక్యూరిటీ పరంగా మనకు పైకి కళ్లకు కనిపించని ఎన్నో రకాల మార్పుల్ని కొత్త వెర్షన్లలో ప్రవేశ పెడుతూ ఉంటుంది.


Updated Date - 2021-01-09T06:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising