ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఫాస్ట్‌ చార్జింగ్‌’లో షావోమి రికార్డ్‌!

ABN, First Publish Date - 2021-03-20T05:58:31+05:30

మొబైల్‌ వినియోగం పాత వార్త. ఇప్పుడు అదెంత వేగంగా చార్జ్‌ అవుతుంది, కొత్త పీచర్లు ఏమిటి, రేటు ఎంత వంటి విషయాలకే ప్రాధాన్యం. తాజా సమాచారం ప్రకారం షావోమి సరికొత్త మొబైల్‌ను అదీ చాలా వేగంగా చార్జ్‌ అయ్యేది తీసుకు వస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్‌ వినియోగం పాత వార్త. ఇప్పుడు అదెంత వేగంగా చార్జ్‌ అవుతుంది, కొత్త పీచర్లు ఏమిటి, రేటు ఎంత వంటి విషయాలకే ప్రాధాన్యం. తాజా సమాచారం ప్రకారం షావోమి సరికొత్త మొబైల్‌ను అదీ చాలా వేగంగా చార్జ్‌ అయ్యేది తీసుకు వస్తోంది. గత ఏడాది జూలైలో ఫోన్‌ చార్జింగ్‌ వేగంలో చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు ఒప్పో, ఐక్యూ, రియల్‌మి ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. ప్రస్తుతం ఈ బరిలోకి షావోమి దిగింది. 120 వాట్‌ అలా్ట్ర - ఫాస్ట్‌ ఫ్లాష్‌ టెక్నాలజీతో 4000 ఎంఎహెచ్‌ బ్యాటరీ జీరో నుంచి యాభై శాతం వరకు అయిదు నిమిషాల్లో చార్జ్‌ అవుతుందని ఐక్యూ ప్రకటించిది. 125 డబ్ల్యూ విఒసిసి ఫాష్‌ చార్జింగ్‌, 125 డబ్ల్యు డబ్ల్యు అలా్ట్ర డార్జ్‌ చార్జ్‌ను వరుసగా ఒప్పో, రియల్‌మి ప్రకటించాయి. ఈ పోటీలోకి దూకుతున్న షావోమీ 200 డబ్ల్యు వైర్డ్‌ చార్జ్‌ సపోర్ట్‌ను తీసుకువస్తోంది. అదే జరిగితే ఫోన్‌ చార్జింగ్‌ వేగంలో ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పిన ఘనత షావోమికి దక్కుతుంది. ‘గిజ్‌ చైనా’ నివేదిక ప్రకారం షావోమి తీసుకువస్తున్న సదరు ఫోన్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. ఈ ఏడాది జూలై తరవాత ఎప్పుడైనా విడుదల కావచ్చు. అది మి మిక్‌4 కావచ్చని భావిస్తున్నారు. 120 వాట్‌ చార్జింగ్‌తో షావోమీ మి10 అలా్ట్ర ఉందని, కొత్తది మి11 అలా్ట్ర కావచ్చని ‘జిఎస్‌మరెనా’ ఊహిస్తోంది. 

Updated Date - 2021-03-20T05:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising