ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో ఆదా చేద్దామిలా!

ABN, First Publish Date - 2021-04-24T06:59:02+05:30

ఆహారం నుంచి అత్యవసర మందుల వరకు ఏదైనా ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభిస్తోంది. నేరుగా ఇంటికి తెచ్చి ఇవ్వడం, కూపన్‌ డిస్కౌంట్స్‌ వంటివి ఆన్‌లైన్‌ మార్కెట్‌ను అందరికీ చేరువ చేశాయి. అయితే బయట బేరమాడి తక్కువకే కొన్నట్టుగానే, ఆన్‌లైన్‌లోనూ డబ్బులు మిగిల్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆహారం నుంచి అత్యవసర మందుల వరకు ఏదైనా ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభిస్తోంది. నేరుగా ఇంటికి తెచ్చి ఇవ్వడం, కూపన్‌ డిస్కౌంట్స్‌ వంటివి ఆన్‌లైన్‌ మార్కెట్‌ను అందరికీ చేరువ చేశాయి. అయితే బయట బేరమాడి తక్కువకే కొన్నట్టుగానే, ఆన్‌లైన్‌లోనూ డబ్బులు మిగిల్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే... 

- కొత్త యూజర్‌గా: ఏదైనా వస్తువు కొనేటప్పుడు కొత్త యూజర్‌ నేమ్‌, కొత్త మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీతో కొత్త ఖాతా తెరవాలి. కొత్త యూజర్లకు చాలా ఆన్‌లైన్‌ సంస్థలు ఈమెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ లేదా యాప్‌ నోటిఫికేషన్‌ ద్వారా వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను అందిస్తాయి. దాంతో 10 నుంచి 50 శాతం డబ్బు ఆదా చేసుకోవచ్చు. 

- మొబైల్‌ యాప్‌: ఆన్‌లైన్‌ కంపెనీలు తమ మొబైల్‌ యాప్‌ను జానాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తాయి. ‘యాప్‌ ద్వారా అదనంగా 5 శాతం ఆదా చేసుకోండి’, ‘మీ మొదటి ఆర్డర్‌పై బహుమతి గెలుచుకోండి’ వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తాయి. యాప్‌ వాడడం ద్వారా తగ్గింపు ధరకే నచ్చినవి కొనుక్కోవచ్చు. 

-  ప్రైజ్‌ డ్రాప్‌ అలర్ట్స్‌: కొందరు తమకు బాగా ఇష్టమైన వస్తువులను కొంచెం ధర తగ్గిన తరువాత కొనాలనుకుంటారు. అప్పుడు వాటికి ప్రైజ్‌ డ్రాప్‌ అలర్ట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఎప్పుడైతే ఆ వస్తువుల ధర తగ్గిందో మీకు ఈమెయిల్‌ లేదా మొబైల్‌ యాప్‌లో నోటిఫికేషన్‌ వస్తుంది. అప్పుడు తక్కువకే కోరుకున్నవి సొంతం చేసుకోవచ్చు.

- కార్ట్‌లో జమ: విష్‌ లిస్ట్‌ సిద్ధం చేసుకొని మీరు కొనాలనుకుంటున్న వస్తువులను కార్ట్‌లో చేర్చాలి. రెండు మూడు రోజుల్లోనే ‘మీ విష్‌ లిస్ట్‌లోని వస్తువుల ధర తగ్గించి, ఇప్పుడు కొనండి’ అని మీకు ఈమెయిల్‌ వస్తుంది. పాత, కొత్త ధరను పోల్చుకోవాలి. మళ్లీ ఆ మెసేజ్‌ వచ్చేదాకా వేచిచూస్తే మరింత తక్కువకే మీ విష్‌లిస్ట్‌లోని వస్తువులను దక్కించుకోవచ్చు. 

- కస్టమర్‌ కేర్‌తో బేరం: మీరు ఆన్‌లైన్‌లో తరచుగా కొనే వారైతే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ లేదా ఈమెయిల్‌ చేసి డిస్కౌంట్‌ కూపన్లు, ఆఫర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అప్పుడు మీకు అదనంగా రెండు నుంచి అయిదు శాతం తగ్గింపు లభించే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-24T06:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising