ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత మార్కెట్లోకి రెడ్‌మీ తొలి స్మార్ట్‌ వాచ్‌

ABN, First Publish Date - 2021-05-22T09:06:16+05:30

షావోమీ సబ్‌ బ్రాండ్‌ ‘రెడ్‌మీ’ తొలి ‘స్మార్ట్‌ వాచీ’ని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 200 వాచ్‌ ఫేస్‌లతో ‘రెడ్‌మీ స్మార్ట్‌ వాచ్‌’ పేరుతో బైటికి వచ్చింది. ఎల్‌సీడీ టచ్‌కు తోడు ‘హార్ట్‌ రేట్‌’ మానిటరింగ్‌, ‘స్లీప్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షావోమీ సబ్‌ బ్రాండ్‌ ‘రెడ్‌మీ’ తొలి ‘స్మార్ట్‌ వాచీ’ని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 200 వాచ్‌ ఫేస్‌లతో ‘రెడ్‌మీ స్మార్ట్‌ వాచ్‌’ పేరుతో బైటికి వచ్చింది. ఎల్‌సీడీ టచ్‌కు తోడు ‘హార్ట్‌ రేట్‌’ మానిటరింగ్‌, ‘స్లీప్‌ ట్రాకింగ్‌’, ‘గైడెడ్‌ బ్రీతింగ్‌’ వంటి హెల్త్‌ మానిటరింగ్‌ ఫీచర్లూ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, మైహోమ్‌, మైకామ్‌ నుంచి ఈ వాచీని రూ.3999కి మే 25 నుంచి పొందవచ్చు. ఐవరీ, బ్లాక్‌, బ్లూ, ఆలివ్‌ కలర్‌ స్ట్రాప్‌లతో విడుదల చేశారు. 1.4 ఇంచీలు, ఫుల్‌ ఎల్‌సీడీ టచ్‌, 320 ఇంటూ 320 పిక్సెల్‌  రిజల్యూషన్‌, ఆటో బ్రైట్‌నెస్‌తోపాటు టాప్‌పై 2.5డి లేయర్‌ కవర్‌ ఉంది.


ఔట్‌డోర్‌ ట్రాకింగ్‌ కోసం జీపీఎస్‌/గ్లోనాస్‌ సపోర్ట్‌ ఉంది. కనెక్టివిటీ కోసం 5.1 బ్లూటూత్‌ ఉంది. విడదీయదగ్గ సిలికాన్‌ స్ట్రాప్‌, నలుచదరం షేప్‌ డయల్‌ను అమర్చారు. రెండు గంటల్లో ఫుల్‌ చార్జ్‌ అవుతుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే పది రోజులు ఉపయోగించుకోవచ్చు. 5ఏటీఎం మేర స్విమ్‌(ఈత)ప్రూఫ్‌ రక్షణ ఉంది. పీపీజీ హార్ట్‌రేట్‌ సెన్సర్‌, త్రీ-యాక్సిస్‌ యాక్సిలరేషన్‌ సెన్సర్‌, జియో మేగ్నటిక్‌ సెన్సర్‌, బారోమీటర్‌, గైరోస్కోప్‌, చుట్టూరా లైట్‌ సెన్సర్‌ ఉన్నాయి.  రన్నింగ్‌, వాకింగ్‌, ఇండోర్‌ సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ తదితరాల కోసం 11 వరకు ఎక్స్‌ర్‌సైజ్‌ మోడ్స్‌ కూడా ఈ వాచ్‌లో అమర్చారు.

Updated Date - 2021-05-22T09:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising