రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల
ABN, First Publish Date - 2021-04-23T01:27:50+05:30
రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. భారత మార్కెట్లో రియల్‌మి 8 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్ 28 నుంచి దేశంలో రియల్‌మి 8 5జీ స్మార్ట్‌ఫోన్స్ లభిస్తాయని కంపెనీ పేర్కొంది. రియల్‌మి ఫోన్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి 8 5జీలో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రియల్‌మి 8 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 14,999 ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కాం, ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది.
Updated Date - 2021-04-23T01:27:50+05:30 IST