ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేమెంట్‌ కార్డ్‌ వివరాల ‘సేవ్‌’కు స్వస్తి

ABN, First Publish Date - 2021-12-04T05:30:00+05:30

పేమెంట్‌ కార్డు వివరాలను 2022 జనవరి 1 నుంచి గూగుల్‌ సేవ్‌ చేయబోవటం లేదు. గూగుల్‌ వన్‌ సబ్‌స్ర్కిప్షన్స్‌ కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆర్‌బీఐ న్యూ గైడ్‌లైన్స్‌

 2022 జనవరి 1 నుంచి వర్తింపు

 ‘యూపీఐ’  పేమెంట్స్‌కు ఓకే

పేమెంట్‌ కార్డు వివరాలను 2022 జనవరి 1 నుంచి గూగుల్‌ సేవ్‌ చేయబోవటం లేదు. గూగుల్‌ వన్‌ సబ్‌స్ర్కిప్షన్స్‌ కోసం, గూగుల్‌ ప్లేతో చేసే ఇతర కొనుగోళ్ళ విషయంలోనూ పేమెంట్‌ వివరాలను గూగుల్‌ సేవ్‌ చేయదు. ప్రతి వ్యవహరంలోనూ వివరాలన్నీ పేర్కొనాల్సిందే. పదేపదే పర్చేజ్‌ చేసే వ్యక్తులకు ఈ నిబంధన ఒకింత చికాకు కలిగించేదే. అయితే, ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు గూగుల్‌ ఈ చర్యలను తీసుకుంది. పేమెంట్‌ గేట్‌వేలన్నింటికీ ఆర్‌బీఐ ఈ నిబంధనను వర్తింపజేసింది. సర్వర్‌లో ఇంతకు మునుపు ఈ వివరాలు నిక్షిప్తమై ఉంటే వాటిని కూడా తొలగించాలి. 

అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్టు యూపీఐ ఆధారిత పేమెంట్స్‌కు ఈ నిబంధన వర్తించదు. ఫలితంగా గూగుల్‌ పే అలాగే ఇతర యూపీఐ యాప్స్‌తో పేమెంట్లు ఎంచక్కా చేసుకోవచ్చు. డెబిట్‌/క్రెడిట్‌ కార్డుతో వ్యవహారాన్ని నడిపించినప్పుడే ఈ సమస్య వస్తుంది. గూగుల్‌ క్రోమ్‌ లేదంటే ఆండ్రాయిడ్‌తో చెల్లింపులకు సీవీసీ నంబర్ని ప్రతి కొనుగోలు వ్యవహారానికీ నింపాల్సి ఉంటుంది. అంతమాత్రాన ఇబ్బందిపడాల్సిన పని లేదు. యూజర్ల హామీతో గూగుల్‌ ఇప్పటికీ సదరు వివరాలను దాచిపెట్టవచ్చు. హామీ ఇచ్చిన యూజర్లు ఈ ఏడాది డిసెంబర్‌ 31 లోపు ఒకసారి అయినా కనీసం ఒక పర్చేజ్‌ చేయాలి. మళ్ళీ డిటైల్స్‌ కూడా నింపాలి.

Updated Date - 2021-12-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising