ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూ గ్రూపులకు నో చెప్పొచ్చు

ABN, First Publish Date - 2021-08-28T05:27:58+05:30

వాట్సాప్‌లో ఉన్నట్టుండి మిమ్మల్ని పలానా ఎక్స్‌,వై,జెడ్‌ గ్రూప్‌లో మెంబర్‌ చేశారంటూ మెసేజ్‌ వస్తుంది. చాలా సందర్భాల్లో ఇలాంటివన్నీ మనం కోరుకోని గ్రూపులే అయి ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సాప్‌లో ఉన్నట్టుండి మిమ్మల్ని పలానా ఎక్స్‌,వై,జెడ్‌ గ్రూప్‌లో మెంబర్‌ చేశారంటూ మెసేజ్‌ వస్తుంది.  చాలా సందర్భాల్లో ఇలాంటివన్నీ మనం కోరుకోని గ్రూపులే అయి ఉంటాయి.  అయితే, వాట్సాప్‌లో ఇలాంటి ధోరణిని అడ్డుకునే ఫీచర్‌ ఉంది. దీని సహాయంతో మీకు అక్కర్లేని గ్రూపుల్లో చేర్చకుండా నివారించుకోవచ్చు. డిఫాల్ట్‌ ఆప్షన్‌గా ‘ఎవ్రీవన్‌’ ఉంటే మీ కాంటాక్ట్‌ లిస్టులో లేనివారు కూడా మిమ్మల్ని గ్రూపులో యాడ్‌ చేయొచ్చు. అలా కాకుండా మనం కస్టమైజ్‌ ఆప్షన్‌ కనక పెట్టుకుంటే మన అంగీకారం లేకుండా ఎవరూ, ఏ గ్రూపులోనూ మెంబర్‌గా  చేయలేరు. 


కంట్రోలింగ్‌ ఇలా....

ఆండ్రాయిడ్‌: టాప్‌ మోర్‌ ఆప్షన్స్‌ - సెట్టింగ్స్‌ - అకౌంట్‌ - ప్రైవసీ - గ్రూప్స్‌

ఐఫోన్‌: టాప్‌ సెట్టింగ్స్‌ - అకౌంట్‌ - ప్రైవసీ - గ్రూప్స్‌

కయ్‌ ఔస్‌: ప్రెస్‌ ఆప్షన్స్‌- సెట్టింగ్స్‌ - అకౌంట్‌ - ప్రైవసీ - గ్రూప్స్‌ 

అక్కడ మూడు ఆప్షన్స్‌ ఉంటాయి. 


ఎవ్రీవన్‌: పేరుకు తగ్గట్టు ఇది అందర్నీ అనుమతిస్తుంది.   ఫోన్‌ అడ్రస్‌ బుక్‌లో లేని కాంటాక్ట్‌ వ్యక్తులు కూడా మన అనుమతి లేకుండానే గ్రూపులో మెంబర్‌గా చేర్చవచ్చు. 


 మై అకౌంట్‌: మీ అడ్రస్‌ బుక్‌లోని కాంటాక్ట్‌ వ్యక్తులు  మాత్రమే మిమ్మల్ని గ్రూపుల్లో యాడ్‌ చేయగలుగుతారు. గ్రూప్‌ అడ్మిన్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేయడానికి ప్రయత్నించగానే  మీకు పాపప్‌ వస్తుంది. చేరాలా, వద్దనుకుంటున్నారా అన్న ఆప్షన్‌ ఉంటుంది. ఒకే బటన్‌ నొక్కిన తరువాత మాత్రమే  మీరు అందులో మెంబర్‌ అవుతారు.  ఇండివిడ్యుయల్‌ చాట్‌ ద్వారా ఈ రకమైన మెసేజ్‌ వస్తుంది. అయితే సదరు ఆహ్వానం మూడు రోజుల్లోనే ఎక్స్‌పైర్‌ అవుతుందని గుర్తుంచుకోవాలి. 


మై కాంటాక్ట్‌ ఎక్సెప్ట్‌: గ్రూపులో మెంబర్‌గా యాడ్‌ అయ్యేందుకు అనుమతించాలా వద్దా అన్న అథారిటీ  మీకు ఉంటుంది. దీన్ని సెలెక్ట్‌ చేసుకునే సమయంలో కొంతమందిని ఎక్స్‌క్లూడ్‌ చేయొచ్చు. అంటే మీరు ఎక్స్‌క్లూడ్‌ చేసిన వ్యక్తులు తప్ప మిగిలినవారు వారు మిమ్మల్ని గ్రూప్‌ మెంబర్స్‌గా యాడ్‌ చేయలేరు. అప్పటికీ ఏదైనా గ్రూప్‌ అడ్మిన్‌ మిమ్మల్ని కలుపుకొనేందుకు ట్రై చేస్తే ‘యు కెనాట్‌ యాడ్‌’ అనే పాపప్‌ తనకు వస్తుంది. దాంతో వారు మిమ్మల్ని యాడ్‌ చేసుకోరు. 


Updated Date - 2021-08-28T05:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising