ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఆడియో వాకింగ్‌ ఫీచర్‌

ABN, First Publish Date - 2021-06-12T05:30:00+05:30

గూగుల్‌ సరికొత్త వాకింగ్‌ ఫీచర్‌ను ప్రారంభించింది. ‘పేస్డ్‌ వాకింగ్‌’ పేరిట ఉన్న ఇది నడకకు సంబంధించిన లక్ష్యాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ సరికొత్త వాకింగ్‌ ఫీచర్‌ను ప్రారంభించింది. ‘పేస్డ్‌ వాకింగ్‌’ పేరిట ఉన్న ఇది నడకకు సంబంధించిన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. వ్యక్తులు వేసే అడుగులకు అనుగుణంగా మ్యూజిక్‌ కూడా ఇందులో వస్తుంది. తద్వారా యూజర్లు ఉత్తేజంగా నడుస్తూ నడకలో తాము పెట్టుకున్న లక్ష్యాలను సులువుగా పూర్తిచేయగలుగుతారు. సైక్లింగ్‌తో ఎంత లాభం పొందుతారో ఈ ఫీచర్‌తో అంతే బెనిఫిట్‌ ఉంటుంది. ప్రస్తుత గూగుల్‌ ఫిట్‌లో ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉంది. వాకింగ్‌ కోసం వేగం పెంచడం వల్ల యూజర్‌కి రోజువారీ జీవితంలో కూడా నడక వేగం అలవాటు అవుతుందని చెబుతున్నారు గూగుల్‌ ఫిట్‌ మెడికల్‌ విభాగం వారు.



వేగంగా నడుస్తూ నిమిషానికి వంద అడుగులు వేస్తే ఒక హార్ట్‌ పాయింట్‌ జమ అవుతుంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ లెక్కల ప్రకారం వారానికి కనీసం 150 హార్ట్‌ పాయింట్లు సాధిస్తే ఆరోగ్యానికి మంచిది. గూగుల్‌ ఫిట్‌కు చెందిన రీసెర్చ్‌ సైంటిస్ట్‌ అభిప్రాయం ప్రకారం పేస్డ్‌ వాకింగ్‌ సెషన్‌లో కొన్ని హెడ్‌ఫోన్లు ఆడియో బీట్‌ను ప్లే చేస్తాయి. జంటిల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ టిక్‌కు తోడు దాన్ని మీరు అనుసరించేలా చేస్తాయి. ఈ యాప్‌ ద్వారా బీట్‌ వేగాన్ని పెంచుకోవచ్చు. ఇది మరో వీడియోలో లభ్యం అవుతుంది. ఆ కారణంగా మ్యూజిక్‌ను వేరుగా ప్లే చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. 


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising