ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్లో ఛార్జింగ్‌కు కారణం?

ABN, First Publish Date - 2021-01-16T05:10:36+05:30

నేను శాంసంగ్‌ జె7 ఫోన్‌ వాడుతున్నాను. ఈ మధ్య అది చాలా స్లోగా ఛార్జింగ్‌ అవుతోంది. దీనికి కారణం తెలుపగలరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేను శాంసంగ్‌ జె7 ఫోన్‌  వాడుతున్నాను.  ఈ మధ్య అది చాలా స్లోగా ఛార్జింగ్‌ అవుతోంది.  దీనికి కారణం తెలుపగలరు ?

- ప్రవీణ్‌, దర్శి


సహజంగా ఫోన్‌ స్లోగా ఛార్జింగ్‌ అవడానికి  అనేకాంశాలు కారణమవుతుంటాయి.  ముఖ్యంగా ఛార్జింగ్‌ పోర్ట్‌ డామేజ్‌ అయినా, దాంట్లో ఏవైనా అడ్డుపడుతున్నా ఈ సమస్య ఏర్పడుతుంది.  చాలామంది యుఎస్‌బి కేబుల్‌ని ఛార్జింగ్‌ పోర్టులో బలంగా పెట్టి తీస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఆ పోర్ట్‌ డామేజ్‌ అవుతుంది. సక్రమంగా ఛార్జింగ్‌ అవకపోవడం, అయినా తగినంత ఓల్టేజ్‌ లభించక స్లోగా అవుతాయి. అలాగే కొన్నిసార్లు ఏ కారణం చేతయినా మీరు వాడుతున్న ఛార్జర్‌ పాడైనా ఇలాగే ఫోన్‌ ఛార్జింగ్‌  నెమ్మదిగా అవుతూ ఉంటుంది. మరికొన్నిసార్లు మీరు వాడుతున్న యుఎస్‌బి కేబుల్‌లో లోపం ఉన్నా  ఇలాగే జరుగుతుంది.  అలాంటప్పుడు వేరే కేబుల్‌ తీసుకువచ్చి  ప్రయత్నించి చూడండి.  ఇవన్నీ బానే ఉండి సమస్య ఏర్పడుతూ ఉన్నట్లయితే బ్యాటరీలో లోపమని  భావించాలి. కొన్ని అరుదైన సందర్భాల్లో మీ ఫోన్లో మాల్వేర్‌ ఉన్నా కూడా అది బ్యాక్‌గ్రౌండ్లో విపరీతంగా బేటరీ ఖర్చు చేస్తూ  ఛార్జింగ్‌ వేగంగా కాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్‌ ఆఫ్‌ చేసి స్టార్ట్‌ చేస్తే వేగంగా ఛార్జింగ్‌ పూర్తవుతుంది. కేవలం మాల్వేర్లు మాత్రమే కాదు, బగ్స్‌తో కూడిన కొన్ని మంచి యాప్స్‌ కూడా ఇలా బ్యాటరీని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఛార్జింగ్‌ స్లోగా అవడానికి దారితీస్తుంటాయి.

Updated Date - 2021-01-16T05:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising