ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సిగ్నల్‌’ యాప్‌లోనూ మెసేజ్‌ డిలీట్‌ ఆప్షన్‌

ABN, First Publish Date - 2021-05-29T08:36:55+05:30

వాట్సప్‌ తరహాలోనే సిగ్నల్‌ యాప్‌లో కూడా ఏదైనా కాంటాక్ట్‌కు మెసేజ్‌ పంపితే డిలీట్‌ చేయవచ్చు. అయితే మెసేజ్‌ పంపిన మూడు గంటల వరకు మాత్రమే మాత్రమే ఈ డిలీట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాట్సప్‌ తరహాలోనే సిగ్నల్‌ యాప్‌లో కూడా ఏదైనా కాంటాక్ట్‌కు  మెసేజ్‌ పంపితే డిలీట్‌ చేయవచ్చు. అయితే మెసేజ్‌ పంపిన మూడు గంటల వరకు మాత్రమే మాత్రమే ఈ డిలీట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. సిగ్నల్‌ యాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌లో మాత్రమే ఈ అప్‌డేట్‌ అందుబాటులో ఉంది.  ఈ ఫీచర్‌ ఎలా వర్క్‌ అవుతుందంటే....


మొదట స్మార్ట్‌ ఫోన్‌లో సిగ్నల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. చాట్‌ను ఓపెన్‌ చేసి డిలీట్‌ చేయాలని అనుకుంటున్న మెసేజ్‌ను వెతకాలి. మూడు గంటలకు లోపు పంపిన మెసేజ్‌ను టాప్‌ చేయాలి. వెంటనే టూల్‌బార్‌ కనిపిస్తుంది. చివరగా డిలీట్‌ ఐకాన్‌ను టాప్‌ చేస్తే చాలు, మెసేజ్‌ డిలీట్‌ అవుతుంది.


సిగ్నల్‌ అకౌంట్‌ నుంచి డిలీట్‌

సిగ్నల్‌ అకౌంట్‌ నుంచి వైదొలగడం కూడా చాలా సులువు. ఒకసారి అకౌంట్‌ డియాక్టివేట్‌ చేస్తే చాలు, సంబంధిత డేటా అంటే మీడియా, చాట్స్‌, కాంటాక్టులు మొత్తం డిలీట్‌ అవుతాయి. ఆండ్రాయిడ్‌ నుంచి డిలీట్‌ అయ్యేందుకు కొంత పద్ధతి ఉంది. ఫోన్‌లో సిగ్నల్‌ యాప్‌ను ముందు ఓపెన్‌ చేసుకోవాలి. ప్రొఫైల్‌  - అడ్వాన్స్‌డ్‌ - డిలీట్‌ అకౌంట్‌ను టాప్‌ చేయాలి. సిగ్నల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. డిలీట్‌ అకౌంట్‌ ఆప్షన్‌పై టాప్‌ చేయాలి. చివరగా కన్‌ఫర్మ్‌ చేస్తే అండ్రాయిడ్‌ నుంచి సిగ్నల్‌ యాప్‌ డిలీట్‌ అవుతుంది.

Updated Date - 2021-05-29T08:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising