ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోన్‌ దొంగలకు అలారం..!

ABN, First Publish Date - 2021-02-07T19:22:17+05:30

అసలే ఖరీదైన ‘ఐ ఫోన్‌’. బయటికి వెళ్లినప్పుడు ఛార్జింగ్‌ పెట్టాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసలే ఖరీదైన ‘ఐ ఫోన్‌’. బయటికి వెళ్లినప్పుడు ఛార్జింగ్‌ పెట్టాలంటే... కాపలా కాయాల్సిందే! జనసమ్మర్ధమున్న బస్టాండ్లు, రేల్వేస్టేషన్లు, హోటళ్లలో ఛార్జింగ్‌ పెట్టినప్పుడు... మనం ఏమాత్రం ఏమర్చినా ఫోన్‌ను ఎత్తుకెళ్లడం ఖాయం. ఫోన్‌ ఛార్జింగ్‌ పూర్తయ్యే వరకు కనిపెట్టుకుని ఉండాల్సిందే!. ఆ సమయంలో కాఫీ తాగుతూ పుస్తకమో, న్యూస్‌పేపరో తిరగేద్దామన్నా మనసు ఒప్పుకోదు. ఈ సమస్యకు ఒక చక్కటి ఉపాయం కనుక్కున్నాడు బోయింగ్‌ విమానాలు నడిపే కెప్టెన్‌ పీటర్‌ లోవెన్‌. దొంగలు ఎవరైనా ముందుగా ఫోన్‌ను దొంగలించాలంటే... ఛార్జింగ్‌ కేబుల్‌ను తొలగిస్తారు. ఆ వైర్‌ను తీస్తున్నప్పుడు ఫోన్‌ పెద్ద శబ్దంతో అలారం మోగిస్తే.. అప్రమత్తం అవుతాం కదా అనిపించింది. ఐడియా భలే ఉందే అనుకున్నాడతను. ఆయన స్వయాన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో... కొందరు మిత్రులతో కలిసి ‘ఐ సేఫ్‌ ఛార్జి’ అనే యాంటీ థెప్ట్‌ యాప్‌ను రూపొందించాడు. ఇది యాప్‌ స్టోర్‌లో లభిస్తోంది. ఈ యాప్‌ మన ఫోన్‌లో ఉంటే చాలు.. ఛార్జింగ్‌ పెట్టినప్పుడు కేబుల్‌ను తొలగించిన వెంటనే పెద్ద శబ్ధంతో అలారం మోగిస్తుంది. అప్పుడు అప్రమత్తం అవ్వొచ్చు. ఇప్పటికే ‘ఐ సేఫ్‌ ఛార్జి’ యాప్‌ను యాభై వేలకు పైచిలుకు డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు. అయితే ఇది పూర్తి ఉచితం కాదు. స్వల్పమొత్తంలో చెల్లించి వాడుకోవచ్చు. నిత్యం ప్రయాణాలు చేసే వారికి బాగా పనికొస్తుంది.

Updated Date - 2021-02-07T19:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising