ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘క్లబ్‌ హౌస్‌’లోకి అందరికీ ఎంట్రీ!

ABN, First Publish Date - 2021-06-05T05:34:12+05:30

ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్‌వర్కింగ్‌ యాప్‌ ‘క్లబ్‌ హౌస్‌’ను మన దేశంలోని ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఏప్రిల్‌లోనే ఆరంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్‌వర్కింగ్‌ యాప్‌ ‘క్లబ్‌ హౌస్‌’ను మన దేశంలోని ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఏప్రిల్‌లోనే ఆరంభించారు. సాధారణంగా ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్‌ ఉండాలి. అయితే తాజాగా ఎలాంటి ఇన్విటేషన్‌ లేకుండానే క్లబ్‌హౌస్‌లో చేరే అవకాశం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. స్మార్ట్‌పోన్‌ వినియోగదారులకు క్లబ్‌ హౌస్‌ ఆప్షన్‌ పెద్ద ఎత్తున కల్పించడం ద్వారా ఎదురైన అనుభవాలపై ఇటీవలే ఒక మీటింగ్‌ జరిగింది.  ఆ తరవాత చేసిన పోస్ట్‌లో క్లబ్‌హౌస్‌కు ఇరవై లక్షల మంది వినియోగదారులు ఉన్నారని, జనరల్‌ రిలీజ్‌తో ఈ వేసవిలో వస్తామని మీటింగ్‌ అనంతరం వెల్లడించారు.


అంటే ఇన్విటేషన్‌ లేకుండానే క్లబ్‌హౌస్‌లో చేరే అవకాశం కలుగనుందని అర్థం. ఈ చర్య ‘ట్విట్టర్‌ స్పేసెస్‌’ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీగా భావించవచ్చు. ప్రస్తుతం ‘క్లబ్‌హౌస్‌’ విలువ నాలుగు బిలియన్‌ డాలర్లుగా ఇటీవల అంచనా కట్టినట్టు సమాచారం. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఆంత్రప్రెన్యూర్లు  దీన్ని ఉపయోగించడం ఇటీవలి కాలంలో పెరిగింది.  

Updated Date - 2021-06-05T05:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising