ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘లైక్‌’ ఇక గోప్యం

ABN, First Publish Date - 2021-05-29T08:39:48+05:30

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్టు చేయగానే ఎన్ని లైక్‌లు వచ్చాయో తెలుస్తూ ఉంటుంది. అయితే ఇకపై వాటిని కావాలంటే హైడ్‌ చేసుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్టు చేయగానే ఎన్ని లైక్‌లు వచ్చాయో తెలుస్తూ ఉంటుంది. అయితే ఇకపై వాటిని కావాలంటే హైడ్‌ చేసుకోవచ్చు.  మనకు ఎన్ని లైక్స్‌ వచ్చాయి, ఎదుటి వ్యక్తులకు ఎన్ని అనే విషయంలో ఒత్తిడికి లోను కావాల్సిన పని ఉండదు. నంబర్‌ గేమ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలని భావించే వ్యక్తులకు సదరు ఆప్షన్‌ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కొత్త ఫీచర్‌ ప్రకారం ఒక వ్యక్తి ఫీడ్‌ చేసే అన్ని పోస్టులకు లైక్స్‌ కౌంట్‌ నుంచి పక్కకు వెళ్ళవచ్చు. కేవలం వ్యక్తిగతంగా పోస్ట్‌ చేసిన వాటికే పరిమితమూ చేసుకోవచ్చు. 


ఈ పద్ధతిలో పోస్టు చేసే వ్యక్తులు ఒత్తిడి తగ్గుతుందా లేదా అన్నది పరీక్షించదలిచినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. అయితే  నిపుణులు, ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం,  కొందరు లైక్స్‌ కౌంట్‌పై ఆసక్తి చూపుతారు. తద్వారా తమ పోస్టుకు లభిస్తున్న ఆదరణను తెలుసుకుంటారు. అలాగే తద్వారా లోపాలనూ సరిదిద్దుకుంటారని తేలింది. అందుకే లైక్స్‌ కౌంటింగ్‌ అవసరమా, వద్దా అన్నది ఉపయోగిస్తున్న వ్యక్తుల ఇష్టానికే విడిచిపెట్టామని ఇన్‌స్టాగ్రామ్‌ వివరంగా ఆ ప్రకటనలో తెలియజేసింది.

Updated Date - 2021-05-29T08:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising