ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆండ్రాయిడ్ ఫోన్ ఇక కారు తాళం చెవి కూడా.. బోలడ్ని ఫీచర్లు తీసుకొస్తున్న గూగుల్

ABN, First Publish Date - 2021-12-02T23:03:08+05:30

మీ ఆండ్రాయిడ్ ఫోన్ త్వరలోనే మరింత ఆకర్షణీయంగా, మరింత ఉపయోగకరంగా మారిపోనుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మీ ఆండ్రాయిడ్ ఫోన్ త్వరలోనే మరింత ఆకర్షణీయంగా, మరింత ఉపయోగకరంగా మారిపోనుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో ‘ఫ్యామిలీ బెల్’, ‘గూగుల్ ఫొటోస్’, ‘కారు కీ’ వంటివి ఉన్నాయి. 


మన దైనందిన కార్యకలాపాలను క్రమం తప్పకుండా, మర్చిపోకుండా పూర్తి చేసేందుకు ‘ఫ్యామిలీ బెల్’ ఫీచర్ పనికొస్తుంది. ఊపిరిసలపని పనుల్లో పడి మర్చిపోయినప్పుడు కానీ, కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడో మీరు మర్చిపోయిన పనుల గురించి ఈ ఆప్షన్ అప్రమత్తం చేస్తుంది. మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులు, హోం స్పీకర్లు, డిజిటల్ స్క్రీన్లకు అలెర్ట్ పంపిస్తుంది. అది మీ బ్రేక్‌ఫాస్ట్‌కు సంబంధించినది కావొచ్చు, మరేదైనా కావొచ్చు. ఫ్యామిలీ బెల్‌ను ఎడిట్ చేసుకుని మనకు అనుకూలంగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. 

 

గూగుల్ ఫొటోస్ పీపుల్ అండ్ పెట్స్ విడ్జెట్ వచ్చే వారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఫొటోలను హోం స్క్రీన్‌ ఫ్రేమ్‌లోకి తెచ్చుకునే వెసులుబాటును ఈ ఫీచర్ అందిస్తుంది. ఆత్మీయుల ఫొటోలతో హోం స్క్రీన్‌ను అందంగా అలంకరించుకోవచ్చు. అలాగే, గత స్మృతులకు సంబంధించిన జ్ఞాపకాలను కూడా ఇది గుర్తు చేస్తుంది. 


గూగుల్ తీసుకొస్తున్న మరో ముఖ్యమైన ఫీచర్ డిజిటల్ కార్ కీ. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లను ఉపయోగించి కారు తాళం తీయడం, తాళం వేయడం చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ను తొలుత ఎంపిక చేసిన దేశాల్లో ‘పిక్సల్ 6’, ‘పిక్సల్ 6 ప్రొ’, ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్21’లో బీఎండబ్ల్యూ కార్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. యాపిల్ కూడా తమ వినియోగదారులకు గతేడాదే ఇలాంటి డిజిటల్ కార్ కీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కూడా ఎంపిక చేసిన కొన్ని లగ్జరీ కార్లకు మాత్రమే అందుబాటులో ఉంది.  

Updated Date - 2021-12-02T23:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising