ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరిన్ని బ్యాంకులతో గూగుల్‌ పే టైఅప్‌

ABN, First Publish Date - 2021-06-19T05:30:00+05:30

గూగుల్‌ పే తన వ్యాపారాన్ని మరిన్ని బ్యాంకులతో అనుసంధానం చేసుకుంటోంది. అందుకు అనుగుణంగా ‘టోకెనైజేషన్‌’ ఫీచర్‌ను ఇంకొన్ని బ్యాంకులకు అందుబాటులోకి తెస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ పే తన వ్యాపారాన్ని మరిన్ని బ్యాంకులతో అనుసంధానం చేసుకుంటోంది. అందుకు అనుగుణంగా ‘టోకెనైజేషన్‌’ ఫీచర్‌ను ఇంకొన్ని బ్యాంకులకు అందుబాటులోకి తెస్తోంది. సెన్సిటివ్‌ డేటా స్థానే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ సింబల్స్‌ ఉపయోగించడాన్ని టోకెనైజేషన్‌ అంటారు. ఈ ప్రక్రియలో వినియోగదారుడి కీలక సమాచారానికి భద్రత కల్పించడమే కాదు, ఈ విషయంలో రాజీ అన్న ప్రసక్తే ఉండదు. ‘విసా’తో కలిసి కొత్త బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పేమెంట్స్‌కు అవకాశం కల్పించనుంది. పటిష్టమైన భద్రత కోసం వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌కు డిజిటల్‌ టోకెన్‌ను అటాచ్‌ చేయనుంది. 


కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బిఐ కార్డ్సు వరకు టోకెనైజేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఎస్‌బిఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డులు; ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బిఎస్‌సి క్రెడిట్‌ కార్డులను జతచేసుకుంది. 25 లక్షల వీసా మర్చెంట్‌ లొకేషన్స్‌ నుంచి ‘నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్స్‌’తో పేమెంట్స్‌ సజావుగా జరిగేలా చూస్తుంది. క్యుఆర్‌ సౌలభ్యం ఉన్న పదిహేను లక్షల మంది భారత వ్యాపారులు తమ క్రెడిట్‌ కార్డులతో వ్యవహారాన్ని సజావుగా సాగించుకునేందుకు ఇది అనువుగా ఉంటుంది.  మంత్ర, యాత్ర, డుంజో వంటి ఆన్‌లైన్‌ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున సాగించే కొనుగోళ్ళకు ఈ టొకెనైజ్డ్‌ కార్డులు ఉపయోగపడతాయి.  

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising