ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేక్ వాట్సాప్‌ను తయారుచేసిన ఇటాలియన్ స్పైవేర్ సంస్థ

ABN, First Publish Date - 2021-02-05T00:33:48+05:30

ఐఫోన్ వినియోగదారులే లక్ష్యంగా ఇటలీకి చెందిన స్పైవేర్ కంపెనీ ‘సై4గేట్’ అనే నిఘా సంస్థ నకిలీ వాట్సాప్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐఫోన్ వినియోగదారులే లక్ష్యంగా ఇటలీకి చెందిన స్పైవేర్ కంపెనీ ‘సై4గేట్’ అనే నిఘా సంస్థ నకిలీ వాట్సాప్‌ను తయారుచేసింది. ఎంపిక చేసుకున్న వినియోగదారులు కొన్ని కన్ఫిగరేషన్ ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేలా చేసి తద్వారా సమాచారాన్ని సేకరించే ఉద్దేశంతో దీనిని తయారుచేసింది. దీని ద్వారా యూనిక్ డివైజ్ ఐడెంటిఫైర్ (యూడీఐడీ) సహా అంతర్జాతీయ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటింటీ (ఐఎంఈఐ) సమాచారాన్ని హ్యాకర్లు పొందగలుగుతారు. అయితే, ఇది ఇక్కడికే పరిమితం కాబోదు.  



2019లోనూ ఇలాంటిదే ఒకటి జరిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌జీవో గ్రూప్ ఒకటి స్పైవేర్‌ను తయారుచేసి ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తల వాట్సాప్ ఖాతాలపై నిఘాపెట్టింది. అప్పట్లో ఇది పెను దుమారం రేపింది. ‘సై4గేట్’ అభివృద్ధి చేసిన ఐఫోన్ వాట్సాప్ ఫేక్‌ వెర్షన్‌ను గుర్తించేందుకు టొరొంటో యూనివర్సిటీలోని సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్ మదర్‌బోర్డును పరిశీలిస్తోంది. ‘సై4గేట్’ నకిలీ వాట్సాప్‌ను సెక్యూరీ కంపెనీ అయిన ‘జెక్ఓప్స్’ గుర్తించింది. 

Updated Date - 2021-02-05T00:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising