ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సిస్టమ్‌ అప్‌డేట్‌’ వద్దు

ABN, First Publish Date - 2021-04-03T05:54:51+05:30

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో డేటాను మటుమాయం చేసే మాల్వేర్‌ ఒకటి వచ్చింది. ‘సిస్టమ్‌ అప్‌డేట్‌’ పేరుతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో డేటాను మటుమాయం చేసే మాల్వేర్‌ ఒకటి వచ్చింది. ‘సిస్టమ్‌ అప్‌డేట్‌’ పేరుతో దూసుకువచ్చిందని మొబైల్‌ సెక్యూరిటీ సంస్థ ‘జిమ్‌పెరియమ్‌’ హెచ్చరించింది. మొబైల్‌లో చేసే ఆన్‌లైన్‌ కార్యకలాపాలను మానిటర్‌ చేయడంతో పాటు అందులో ఉండే డేటాను కూడా సంగ్రహిస్తోంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ‘సిస్టమ్‌ అప్‌డేట్‌’ పేరుతో యావత్తు తతంగం నడుస్తోంది. రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌(ర్యాట్‌) కేటగిరి కిందకు ఈ మాల్వేర్‌ను పరిశోధకులు చేర్చారు. డేటాబేస్‌లో ఉన్న ఫైల్స్‌, చేసే మెసేజ్‌లు, కాల్‌ సంభాషణల వరకు అన్నింటిపైనా దీని ప్రభావం కనిపిస్తోంది.


వాస్తవానికి ఈ మాల్వేర్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి మూడో పార్టీ స్టోర్స్‌ నుంచి వచ్చి చేరుతోంది. దీని భారి నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతానికి ఒకటే మార్గం ఉంది. ‘గూగుల్‌ ప్లేస్టోర్‌’ మినహా మూడో పార్టీ నుంచి వచ్చే వేటినీ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. అప్‌డేట్‌లు అన్నీ ఒఈంలో మాత్రమే వస్తాయి. సెట్టింగ్‌ మెనూ లోపల అప్‌డేట్స్‌ సెక్షన్‌లో కనిపిస్తుంది. అలాగే మాల్వేర్‌ దాడికి గురికాకుండా ఉండేందుకు మంచి యాంటీ వైరస్‌ కొనుగోలు చేసుకుని ఉపయోగించడం చాలా మంచిది. 


Updated Date - 2021-04-03T05:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising