ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెస్క్‌టాప్‌ ‘వాట్సాప్‌ కాల్‌’ ఇనస్టలేషన్‌ ఇలా

ABN, First Publish Date - 2021-03-06T06:11:22+05:30

ఇన్ని రోజులు మొబైల్‌ యాప్‌లో మాత్రమే ఉన్న వాట్సాప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ సౌకర్యం ఇప్పుడు డెస్క్‌టాప్‌లో కూడా అందుబాటులోకి రానుంది. అయితే మోబైల్‌ తరహాలో పూర్తిస్థాయిలో కాకుండా కొంత పరిమితులతో కాల్‌ సౌకర్యాలను కల్పించనుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్ని రోజులు మొబైల్‌ యాప్‌లో మాత్రమే ఉన్న వాట్సాప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ సౌకర్యం ఇప్పుడు డెస్క్‌టాప్‌లో కూడా అందుబాటులోకి రానుంది. అయితే మోబైల్‌ తరహాలో పూర్తిస్థాయిలో కాకుండా కొంత పరిమితులతో కాల్‌ సౌకర్యాలను కల్పించనుంది. 


డెస్క్‌టాప్‌ వాట్సాప్‌ కాల్‌ మాట్లాడాలంటే ఏమి చేయాలి, మరేవి చేయకూడదు అన్నది మొదట తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి వాట్సాప్‌ వెబ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. విండోస్‌ అలాగే మేక్‌ఔస్‌ల్లో మాత్రమే ప్రస్తుతం ఇది పనిచేస్తుంది. వ్యక్తిగత కాల్స్‌కు మాత్రమే ప్రస్తుతానికి పరిమితం. గ్రూప్‌ కాల్స్‌ చేసుకునే అవకాశం లేదు. 


అవసరమైనవి

  • విండోస్‌ 10 64-బిట్‌ వెర్షన్‌ 1903, న్యూయర్‌
  • మేక్‌ఔస్‌ 10.13, న్యూయర్‌
  • ఆడియో ఔట్‌పుట్‌ డివైస్‌, వాయిస్‌ అలాగే వీడియో కాల్స్‌ కోసం మైక్రోఫోన్‌, వీడియో కాల్స్‌ కోసం కెమెరా
  • కంప్యూటర్‌, ఫోన్‌కు యాక్టివ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌
  • కంప్యూటర్‌ మైక్రోఫోన్‌, కెమెరాకు యాక్సెస్‌ కోసం వాట్సాప్‌ పర్మిషన్‌


ఆపరేషన్‌ ఎలా?

  • ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అనుసరించి వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. 
  • డెస్క్‌టాప్‌ పై ఉన్న యాప్‌ను ఓపెన్‌ చేయండి. మీ స్మార్ట్‌ ఫోన్‌లోని వాట్సాప్‌ను ఉపయోగించి క్యుఆర్‌ కోడ్‌ని స్కాన్‌తో కాన్‌ఫిగర్‌ చేసుకోండి.
  • ఒకసారి ఇదంతా పూర్తయిన తరవాత చాట్‌ విండోకు వెళ్ళండి. రైట్‌ కార్నర్‌లో వాయిస్‌, వీడియో కాల్‌ కోసం ఐకాన్‌ ఉంటుంది. 
  • వాయిస్‌ కాల్‌  కోసం సంబంధిత బటన్‌ లేదంటే వీడియో కాల్‌ కోసం దాని బటన్‌ హిట్‌ చేసి పనికానివ్వండి.


రిసీవర్‌

  • వాట్సాప్‌నుంచి కాల్‌ మనకే వస్తే పాపప్‌ విండో డెస్క్‌టాప్‌పై ప్రత్యక్షమవుతుంది. కాల్‌ని తీసుకునేందుకు రిసీవ్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. 
  • వద్దు అనుకుంటే డిస్‌కనెక్ట్‌ బటన్‌ నొక్కండి. 
  • ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉన్నందున డెస్క్‌టాప్‌ వీడియో, ఆడియోకాల్‌కు కూడా మోబైల్‌ అంతే భద్రత, విశ్వసనీయత ఉంటుందని  వాట్సాప్‌ తెలిపింది. 

Updated Date - 2021-03-06T06:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising