ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెల్కమ్ పొలార్డ్.. 6 సిక్సులపై యూవీ

ABN, First Publish Date - 2021-03-05T03:28:42+05:30

విండీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్‌కు యువరాజ్ వెల్కమ్ చెప్పాడు. తన క్లబ్‌లోకి ఆహ్వానించాడు. ఇంతకీ ఆ క్లబ్ ఏంటని అనుకుంటున్నారా..? ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టిన క్లబ్. బుధవారం వెస్టిండీస్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెటె డెస్క్: విండీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్‌కు యువరాజ్ వెల్కమ్ చెప్పాడు. తమ క్లబ్‌లోకి ఆహ్వానించాడు. ఇంతకీ ఆ క్లబ్ ఏంటని అనుకుంటున్నారా..? ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టిన క్లబ్. బుధవారం వెస్టిండీస్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పొలార్డ్ ఈ ఘనత సాధించాడు. లంక స్పిన్నర్ అఖిల ధనంజయ వేసిన ఓవర్లో ఏకంగా 6 బంతులను 6 సిక్సులుగా మలిచి విండీస్ తరపున ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే పొలార్డ్ సాధించిన అరుదైన ఫీట్‌పై యువరాజ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి స్వాగతం కీరన్‌ పొలార్డ్‌. అద్భుతంగా ఆడావ్‌!!!’ అంటూ ట్వీట్ చేశాడు.


ఇదిలా ఉంటే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్ ఇద్దరే. ఒకరు సౌత్‌ఆఫ్రికా బ్యాట్స్‌మన్ హర్షల్ గిబ్స్‌ కాగా.. మరోకరు యువరాజ్ సింగ్. ఇక ఇప్పుడు ఆ జాబితాలోకి కీరన్ పొలార్డ్ కూడా చేరాడు. అయితే అందరికన్నా ముందు ఈ ఘనత సాధించింది గిబ్స్. 2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచులో 6 సిక్సర్లు బాదేశాడు. ఆ తర్వాత అదే ఏడాది జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లీష్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ విసిరిన ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు.



Updated Date - 2021-03-05T03:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising