ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సల్మాన్ ఖాన్ అయితే నాకేంటి?.. విమానాశ్రయంలో ఆపేసిన యువ అధికారి

ABN, First Publish Date - 2021-08-24T02:31:01+05:30

సినీ నటులను చూసేందుకు జనం ఎగబడడం మన దేశంలో సర్వసాధారణమైన విషయం. వారితో సెల్ఫీలు దిగాలని, కరచాలనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సినీ నటులను చూసేందుకు జనం ఎగబడడం మన దేశంలో సర్వసాధారణమైన విషయం. వారితో సెల్ఫీలు దిగాలని, కరచాలనం చేయాలని కోరుకునే అభిమానులెందరో. విధుల్లో ఉన్న అధికారులు కూడా ఇందుకు అతీతులు కారు. నటీనటులు కనిపిస్తే విధులు పక్కనపెట్టి సెల్ఫీలు తీసుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. సినీ నటులను అంతగా ఆరాధించే వేళ.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ముంబై విమానాశ్రయంలో షాక్ తగిలింది. సెక్యూరిటీ చెక్‌ను పట్టించుకోకుండా వెళ్తున్న సల్మాన్ ఆపేసిన యువ సీఐఎస్ఎఫ్ అధికారి.. తొలుత వాటిని పూర్తి చేయమని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది.


ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘టైగర్ 3’ సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లేందుకు సల్మాన్ ఖాన్ ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించడానికి ముందు తప్పనిసరిగా సెక్యూరిటీ చెక్ చేయించుకోవాల్సి ఉండగా, సల్మాన్ అదేమీ పట్టనట్టు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పుడు సల్మాన్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఎంట్రన్స్ వద్ద ఉన్న ఉన్న యువ సీఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకుని.. తొలుత సెక్యూరిటీ చెక్ పూర్తిచేయాలని కోరారు. అదే సమయంలో సల్మాన్ ఫొటోలను తీస్తున్న ఫొటోగ్రాఫర్లను వెనక్కి వెళ్లాల్సిందిగా కోరడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తోంది. సెలిబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ బయానీ ఈ వీడయోను పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. 



Updated Date - 2021-08-24T02:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising