ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi tells: అయోధ్యను సందర్శించండి

ABN, First Publish Date - 2021-08-18T18:40:28+05:30

మీరు అయోధ్యను సందర్శించండి అంటూ పీవీ సింధూ కొరియన్ కోచ్ టే సాంగ్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీవీ సింధూ కొరియన్ కోచ్ టే సాంగ్‌కు ఆహ్వానం

 న్యూఢిల్లీ : మీరు అయోధ్యను సందర్శించండి అంటూ పీవీ సింధూ కొరియన్ కోచ్ టే సాంగ్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానించారు. దక్షిణ కొరియా, భారతదేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ప్రధాని మోదీ ప్రస్థావించారు. 2018 వ సంవత్సరంలో దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్ సూక్ అయోధ్యను సందర్శించారని మోదీ కొరియన్ కోచ్ కు చెప్పారు.‘‘అయోధ్య, దక్షిణ కొరియా మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. ఒక ప్రత్యేక అతిథిగా పాల్గొనడానికి దక్షిణ కొరియా ప్రథమ మహిళ భారతదేశానికి వచ్చారు. మీరు తప్పనిసరిగా అయోధ్యను సందర్శించి చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి. మీరు గర్వంగా ఫీల్ అవుతారు’’ అని ప్రధాని మోదీ పార్క్ టే-సాంగ్‌తో అన్నారు.


తాను భారత ప్రధానమంత్రితో సమావేశం అవుతున్నానని తాను భార్యకు చెబితే ఆమె ఆశ్చర్యపోయిందని పార్క్ టే సాంగ్ ప్రధానికి చెప్పారు. దీంతో ప్రధాని మోదీ ఫొటోగ్రాఫరును పిలిచి తామిద్దరూ కలిసి ఉన్న ఫొటో తీయమని అడిగారు.టోక్యో ఒలింపిక్స్ 2020 లో విజయం సాధించిన తర్వాత భారత అథ్లెట్లు, కోచ్ లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంభాషించిన సందర్భంలో అయోధ్యను సందర్శించాలని సూచించారు. 


Updated Date - 2021-08-18T18:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising