ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిరాజ్‎కు ఘనస్వాగతం

ABN, First Publish Date - 2021-01-21T17:51:19+05:30

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో ఘనస్వాగతం లభించింది. సిరాజ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో ఘనస్వాగతం లభించింది. సిరాజ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. గబ్బా పిచ్‌పై 6 వికెట్లు పడగొట్టి భారత్‌ విజయం సాధించడంలో కీలకప్రాత పోషించాడు. మొత్తంగా టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధికంగా 13 వికెట్లు తీశాడు. తండ్రి మహ్మద్ గౌస్ చనిపోయినప్పటికీ ఆ దుఃఖాన్ని దిగమింగుకుని టోర్నీలో కొనసాగాడు సిరాజ్. దీంతో క్రికెట్‌పై అతడికున్న ప్రేమ ఎలాంటిదో యావత్ భారత దేశానికీ చాటి చెప్పాడు. అంతేకాదు తొలి టెస్టులో బూమ్రా కొట్టిన బంతి నేరుగా ఆసీస్ బౌలర్‌ను తాకడంతో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న సిరాజ్ పరుగు చేయాలని కూడా మర్చిపోయి, బ్యాట్‌ను అక్కడే వదిలేసి అతడి దగ్గరకు పరుగున వెళ్లాడు. దీంతో అతడు చూపించిన స్పోర్ట్స్‌మెన్‌షిప్‌కు భారత క్రికెట్ అభిమానులతో సమా ఇతర దేశాల క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఇక మాజీ క్రికెటర్లు సైతం అతడిని ప్రశంసించారు.


ఇదిలా ఉంటే స్వదేశీ పర్యటనలో ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం సిరాజ్ ఇంగ్లాండ్‎తో జరిగే టెస్ట్ సిరీస్‎లో పాల్గొననున్నాడు. ఆసీస్ పర్యటనలో టెస్టు సిరీస్‎లో భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. అయితే.. సాయంత్రం 5.30గంటలకు టోలిచౌకిలోని తన ఇంటి వద్ద క్రికెటర్ సిరాజ్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సిరాజ్ ప్రెస్ మీట్‎లో.. ఎం చెబుతాడో..! అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2021-01-21T17:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising