ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాండాలో కష్టం.. జపాన్‌లోనే ఉంటా!

ABN, First Publish Date - 2021-07-18T08:48:56+05:30

ఉగాండాలో బతకడం కష్టమని అందుకే జపాన్‌లో ఉండేందుకే తాను జట్టును వీడినట్టు ఆ దేశ వెయిట్‌లిఫ్టర్‌ జూలియస్‌ సెకిటొలెకో తెలిపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒలింపిక్స్‌ 5 రోజుల్లో

అదృశ్యమైన లిఫ్టర్‌ లేఖ

ఉగాండాలో బతకడం కష్టమని అందుకే జపాన్‌లో ఉండేందుకే తాను జట్టును వీడినట్టు ఆ దేశ వెయిట్‌లిఫ్టర్‌ జూలియస్‌ సెకిటొలెకో తెలిపాడు. ఈమేరకు అతడు తన హోటల్‌ గదిలో ఓ లేఖరాసి పెట్టాడు. ఒసాకా రాష్ట్రంలోని ఇజుమిసానో పట్టణంలో సాధన చేస్తున్న ఎనిమిదిమంది ఉగాండా అథ్లెట్లలో జూలియస్‌ ఒకడు. అయితే శుక్రవారం అతడు హోటల్‌నుంచి అదృశ్యమైన సంగతి తెలిసిందే. కాగా..సెకిటొలెకో ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాకపోవడంతో వచ్చే మంగళవారం అతడు స్వదేశానికి పయనం కావాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు జీవించడానికి అనువుగా లేవని, అందువల్ల జపాన్‌లోనే ఉండి ఇక్కడే పనిచేసేందుకు తాను జట్టును వీడుతున్నట్టు అతడు లేఖ రాశాడు. జూలియస్‌ అదృశ్యంపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా..సమీపంలోని రైల్వేస్టేషన్‌ నుంచి అతడు మధ్య జపాన్‌లోని నగోయా పట్టణానికి టిక్కెట్‌ కొన్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్డయింది. 

Updated Date - 2021-07-18T08:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising