ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లాండ్‌తో టెస్టులకు ఎంపికైన భరత్ పేరున భారీ రికార్డ్.. అందుకే..!

ABN, First Publish Date - 2021-01-21T17:54:00+05:30

ఆస్ట్రేలియతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత యువ ఆటగాళ్లు అదరగొట్టారు. ఎవరో ఒకరిద్దరు కాదు. జట్టంతా సమష్టిగా ఆడి.. చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంలో అరంగేట్ల ఆటగాళ్లైన నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు అనుభవజ్ఞులైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత యువ ఆటగాళ్లు అదరగొట్టారు. ఎవరో ఒకరిద్దరు కాదు. జట్టంతా సమష్టిగా ఆడి.. చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంలో అరంగేట్ల ఆటగాళ్లైన నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు అనుభవజ్ఞులైన పుజారా రహానేలూ ఉన్నారు. అయితే అంతగా రాణించినప్పటికీ వీరిలో కొంతమందిని తదుపరి సిరీస్‌ కోసం బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఇలాంటి సందర్భంలో స్టాండ్‌బైగా ఓ యువ ఆటగాడిని ఎంపిక చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చే నెల నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ జట్టులో అనూహ్యంగా విశాఖకు చెందిన ఓ కుర్ర క్రికెటర్‌కు స్థానం కల్పిస్తూ బీసీసీఐ జట్టును ప్రకటించింది. విశాఖలోని మధురవాడకు చెందిన కోన శ్రీకర్ భరత్‌ను స్టాండ్ బై ఆటగాడిగా తీసుకుంది. ఆసీస్‌తో అద్భుతంగా పోరాడి గెలిచిన ఆటగాళ్లను సైతం పక్కన పెట్టి ఓ అరంగేట్ర ఆటగాడిని ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో అసలు ఈ కోన భరత్ ఎవరనే దానిపై క్రికెట్ అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. అతడి గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు. 




కోన శ్రీకర్ భరత్ ఆంధ్ర క్రికెట్ టీంలో వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నాడు. 2015లో తొలిసారిగా రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ చరిత్ర సృష్టించాడు. దీంతో అతడిపై బీసీసీఐ దృష్టి పడింది. ఆ తరువాత కూడా శ్రీకర్ భరత్ ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడిని భారత జట్టుకు ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటివరకు శ్రీకర్ భరత్ తన కెరీర్లో 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో 9 సెంచరీలు, 23 అర్థ సెంచరీలతో, 37.2 సగటుతో 4283 పరుగులు చేశాడు. ఇక 51 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన భరత్ 3  సెంచరీలు, 5 అర్థ సెంచరీలతో 28.1 సగటుతో 1351 పరుగులు చేశాడు. 

Updated Date - 2021-01-21T17:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising