ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: తొలి టీ20 ముందు హార్దిక్ ఇలా చేశాడేంటి..?

ABN, First Publish Date - 2021-07-26T05:41:19+05:30

వన్డే సిరీస్ విజయం తరువాత టీమిండియా శ్రీలంకతో ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో తలపడుతోంది. తొలి మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఘన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్డే సిరీస్ విజయం తరువాత టీమిండియా శ్రీలంకతో ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో తలపడుతోంది. తొలి మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ శిఖర్ ధవన్(46), సూర్యకుమార్ యాదవ్(50)కు తోడు బౌలింగ్‌లో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టడంతో సునాయాసంగా శ్రీలంకను మట్టి కరిపించింది. అయితే ఇదంతా ఓ ఎత్తయితే మ్యాచ్ ముందు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన ఓ పని ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అది కూడా జాతీయ గీతాలు ఆలపించే సమయంలో హార్దిక్ ఇలా చేయడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


మ్యాచ్ ప్రారంభానికి ముందు సంప్రదాయం ప్రకారం ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జాతీయ గీతాలను ఆలపించారు. ముందుగా టీమిండియా ఆటగాళ్లు భారత జాతీయ గీతాన్ని ఆలపించగా.. ఆ తర్వాత శ్రీలంక జాతీయ గీతం వంతు వచ్చింది. ఈ సందర్భంగా హార్దిక్‌.. శ్రీలంక ఆటగాళ్లతో కలిసి వారి దేశ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కనిపించాడు. భారత జాతీయ గీతంతో పాటు శ్రీలంక జాతీయ గీతం కూడా హార్దిక్ ఆలపిచడం క్రికెట్ ఫ్యాన్స్‌లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.


హార్దిక్‌ చేసిన పనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు అతడి పనిని ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. శ్రీలంక జాతీయ గీతం ‘నమో నమో మాతా జాతీయ గీతం’ పాండ్యాకు బాగా నచ్చి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే మరొకరేమో ‘శ్రీలంకపై తన ఉదారతను హార్దిక్ చాటుకున్నాడని, ఈ మ్యాచ్‌లో రాణించేదేముండదు కదా మరి’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం హార్దిక్ పనిని మనసారా అభినందిస్తున్నారు. ‘ప్రత్యర్థిని గౌరవించడం అంటే ఇదే. హార్దిక్‌ను చూసి అందరూ నేర్చుకోవాలి’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో కేవలం 10 పరుగలు మాత్రమే చేసి మళ్లీ నిరాశపరిచాడు. బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి అందకింటే ఎక్కువగ 8.50 సగటుతో పరుగులు సమర్పించుకున్నాడు. ఓ వికెట్ తీశాడు.



Updated Date - 2021-07-26T05:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising