ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరిసిన విన్స్.. బిగ్‌బాష్ లీగ్ విజేతగా సిడ్నీ సిక్సర్స్

ABN, First Publish Date - 2021-02-07T01:56:40+05:30

లీగ్ క్రికెట్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ‘బిగ్‌బాష్ లీగ్’లో సిడ్నీ సిక్సర్ జట్టు ఈ సీజన్ విజేతగా అవతరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: లీగ్ క్రికెట్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ‘బిగ్‌బాష్ లీగ్’లో సిడ్నీ సిక్సర్ జట్టు ఈ సీజన్ విజేతగా అవతరించింది. ఆ జట్టుకు ఇది మూడో టైటిల్. ప్రత్యర్థి పెర్త్ స్కాచెస్ నాలుగోసారి ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ మరోమారు చివరి మెట్టుపై బోల్తాపడింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు పరస్పరం తలపడడం ఇది నాలుగోసారి. టైటిల్ వేటలో 28 పరుగుల ముందు ఆగిపోయిన పెర్త్ జట్టు రికార్డును దూరం చేసుకుంది.


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ చెలరేగి ఆడి జట్టు స్కోరును అమాంతం పెంచేశాడు. 60 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 95 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్ 9 పరుగులకే అవుటవగా, డేనియల్ హ్యూస్ 13, కెప్టెన్ హెన్రిక్స్ 18, సిల్క్ 17, క్రిస్టియన్ 20, బ్రాత్‌వైట్ 10 పరుగులు చేశారు. పెర్త్ బౌలర్లలో జే రిచర్డ్‌సన్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు పడగొట్టగా, పవాద్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నాడు. 


అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పెర్త్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేసి విజయానికి 28 పరుగుల ముందు చతికిలపడింది. పెర్త్ బ్యాట్స్‌మెన్‌లలో కేమరన్ బాన్‌క్రాఫ్ట్ (30), లియామ్ లివింగ్‌స్టోన్ (45), జోస్ ఇంగ్లిస్ (22), ఆరోన్ హార్డీ (26) మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. 


సిడ్నీ బౌలర్లలో జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, డేనియల్ క్రిస్టియన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. బెన్ డ్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. సిడ్నీ సిక్సర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన జేమ్స్ విన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా, జోష్ ఫిలిప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ లభించింది.

Updated Date - 2021-02-07T01:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising