ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్విన్ అన్నలా నడిపించాడు: విహారి

ABN, First Publish Date - 2021-01-12T05:08:13+05:30

రవిచంద్రన్‌ అశ్విన్‌ తనకు అన్నలా వెన్నుతట్టి ముందుకు నడిపాడని హనుమ విహారి చెప్పాడు. క్రీజులో తనకు పెద్దన్నలా అండగా నిలబడ్డాదని ఆకాశానికెత్తేశాడు. అతడి మద్దతుతోనే గొప్పగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రవిచంద్రన్‌ అశ్విన్‌ తనకు అన్నలా వెన్నుతట్టి ముందుకు నడిపాడని హనుమ విహారి చెప్పాడు. క్రీజులో తనకు పెద్దన్నలా అండగా నిలబడ్డాదని ఆకాశానికెత్తేశాడు. అతడి మద్దతుతోనే గొప్పగా ఆడానని చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో అశ్విన్, విహారి అద్భుతంగా ఆడి భారత్‌ను ఓటమి నుంచి బయటపడేశారు. 259 బంతులాడి కేవలం 62 పరుగులు చేశారు. వీరి దూర్బేధ్యమైన డిఫెన్స్‌ను ఆసీస్ బౌలర్లు ఛేదించలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన విహారి ‘అశ్విన్‌ నాకు ఒక్కటే చెప్పాడు. ఒకసారి ఒక్క బంతిపైనే దృష్టి పెట్టమని సలహా ఇచ్చాడు. అందుకే అంత ఏకాగ్రతగా ఆడగలిగాను’ అంటూ విహారి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఐదో రోజు బ్యాటింగ్ చేయడం, అందులోనూ జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం గొప్ప జ్ఞాపకమని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే అశ్విన్, విహారిలను మాజీలు పొగడ్తలతో ముంచెత్తారు. అద్భుతంగా ఆడారని, టెస్టు ఎలా ఆడాలో నిరూపించారని ప్రశంశలతో ముంచెత్తారు.

Updated Date - 2021-01-12T05:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising