ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాప్ పట్టుకోనన్న అంపైర్.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన అఫ్రిది

ABN, First Publish Date - 2021-02-26T00:59:48+05:30

పాక్ సీనియర్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ ఓ అంపైర్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. బౌలింగ్ వేసే సమయంలో తన క్యాప్ పట్టుకునేందుకు అంపైర్ నిరాకరించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పాక్ సీనియర్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ ఓ అంపైర్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. బౌలింగ్ వేసే సమయంలో తన క్యాప్ పట్టుకునేందుకు అంపైర్ నిరాకరించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా పెషావర్ జల్మి, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముల్తాన్ సుల్తాన్స్ తరపున బౌలింగ్ చేసేందుకు వచ్చిన అఫ్రిది తన క్యాప్‌ను పట్టుకునేందుకు అంపైర్ నిరాకరించినట్లు సమాచారం. కరోనా నిబంధనల వల్ల తాను పట్టకోలేనని చెప్పాడట. దీంతో అసహనానికి గురైన అఫ్రిది.. ట్విటర్ వేదికగా ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. 


‘డియర్ ఐసీసీ.. ఆశ్చర్యంగా ఉంది. బౌలర్ల క్యాప్ పట్టుకునేందుకు అంపైర్లకు ఎందుకు అనుమతి లేదు..? అంపైర్లు, మేనేజ్‌మెంట్ అంతా ఆటగాళ్లతో పాటు అదే బయో బబుల్‌లో ఉంటారు. మ్యాచ్ ముగిసిన తరువాత ఒకరికొకరు కరచాలనం కూడా చేస్తారు. కానీ క్యాప్‌లు పట్టుకోవడానికి మాత్రం ఎందుకు అనుమతించరు..?’ అంటూ అఫ్రిదీ తన ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

Updated Date - 2021-02-26T00:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising