ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమేశ్‌, కల్దీప్‌లకు చాన్స్‌!

ABN, First Publish Date - 2021-03-03T09:47:23+05:30

ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత్‌ 10 వికెట్లతో ఘనవిజయం సాధించినా.. చర్చంతా పిచ్‌ చుట్టూనే సాగింది. అయితే చివరిదైన నాలుగో టెస్టు కోసం మళ్లీ టర్నింగ్‌ వికెట్‌ను రూపొందించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత్‌ 10 వికెట్లతో ఘనవిజయం సాధించినా.. చర్చంతా పిచ్‌ చుట్టూనే సాగింది. అయితే చివరిదైన నాలుగో టెస్టు కోసం మళ్లీ టర్నింగ్‌ వికెట్‌ను రూపొందించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. దీనికి రెండు కారణాలున్నాయి. గులాబీ టెస్టులో స్పిన్నర్లు లీచ్‌, రూట్‌ బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడ్డారు. డబ్ల్యుటీసీ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్‌ ఇప్పుడు ఎలాంటి రిస్క్‌ తీసుకోవాలను కోవడం లేదు. అలాగే వరుసగా రెండు కఠిన పిచ్‌లను రూపొందిస్తే ఐసీసీ, బీసీసీఐ మధ్య విభేదాలు నెలకొనే అవకాశం ఉందని స్టేడియం నిర్వాహకులు భావిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నాలుగో టెస్టు వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని భావిస్తున్నారు.  


గిల్‌ స్థానంలో మయాంక్‌.. సుందర్‌ స్థానంలో కుల్దీప్‌
ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇటీవలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేకపోతున్నాడు. అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను ఆడిం చవచ్చు. మయాంక్‌ మూడు శతకాలు స్వదేశంలోనే రావడం విశేషం. బుమ్రా గైర్హాజరీతో పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ జట్టులోకి రావొచ్చు. 2018 నుంచి ఇక్కడ ఆడిన 7 టెస్టుల్లో ఉమేశ్‌ 38 వికెట్లు సాధించాడు. స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ బౌలర్‌కన్నా బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నాడు.  దీంతో అతడి స్థానాన్ని కుల్దీప్‌ భర్తీ చేయొచ్చు.

Updated Date - 2021-03-03T09:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising