ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. టాస్‌ను అడ్డుకున్న వర్షం

ABN, First Publish Date - 2021-06-18T20:34:45+05:30

ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌతాంప్టన్: ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అనకున్నట్టే వరుణుడు అడ్డుతగిలాడు. సౌతాంప్టన్‌లో వర్షం కురుస్తుండడంతో టాస్ వేయడం సాధ్యం కాలేదు. ఇక్కడ వర్షం పడే అవకాశం 91 శాతం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. మైదానం మొత్తం మబ్బులతో నిండిపోయింది. ఇప్పటి వరకు టాస్ పడకపోవడంతో ఫస్ట్ సెషన్ పూర్తిగా వర్షార్పణమైనట్టే.


ఈ మ్యాచ్ కనుక జరగకుంటే భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడే ఆ విషయం చెప్పడం తొందరపాటే అవుతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఫైనల్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కోహ్లీ, విలియమ్సన్ సేనలు పూర్తిగా సిద్ధమయ్యాయి. కివీస్‌పై ఏరకంగా చూసిన భారత్‌దే పైచేయి కావడంతో డబ్ల్యూటీసీ పైనల్ విజేతగా భారత్ నిలుస్తుందని ఇప్పటికే పలువురు తాజా, మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. అయితే, సౌతాంప్టన్‌లో ప్రస్తుత పరిస్థితులు మ్యాచ్‌ను పూర్తిగా అడ్డుకునేలానే కనిపిస్తున్నాయి.

Updated Date - 2021-06-18T20:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising