ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Olympics: టోక్యోలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-07-27T20:59:26+05:30

ఒలింపిక్స్ జరుగుతున్న వేళ టోక్యోలో కరోనా కేసులు మరోమారు భయపెట్టే స్థాయిలో నమోదవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఒలింపిక్స్ జరుగుతున్న వేళ టోక్యోలో కరోనా కేసులు మరోమారు భయపెట్టే స్థాయిలో నమోదవుతున్నాయి. నగరంలో నేడు ఏకంగా 2,848 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైన తర్వాత టోక్యోలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. పెరుగుతున్న కేసులతో టోక్యోలోని ఆసుపత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. 


ఆదివారం టోక్యోలో 12,635 మంది కరోనాతో ఆసుపత్రులలో చేరారు. కాగా, నేడు ఒలింపిక్స్‌తో సంబంధం ఉన్న ఏడు కేసులు వెలుగుచూశాయి. వీరిలో నలుగురు అథ్లెట్లు కాగా, ఒలింపిక్ గ్రామంలోని ఇద్దరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, ఒలింపిక్ అథ్లెట్లు, ఇతరులు ఇప్పటికే 155 మంది కరోనా బారినపడ్డారు. దీంతో క్రీడలను రద్దు చేయాలంటూ టోక్యో వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కరోనా బారినపడిన అథ్లెట్లు, ఇతరుల వల్ల కేసులు మరింత ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చేస్తున్నారు.  

Updated Date - 2021-07-27T20:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising