ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యో పారాలింపిక్స్ : భారత్‌కు మరో పతకం సాధించిన ప్రవీణ్ కుమార్

ABN, First Publish Date - 2021-09-03T15:04:54+05:30

పారాలింపిక్స్, 2021లో భారత్‌కు మరో పతకం లభించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో : పారాలింపిక్స్, 2021లో భారత్‌కు మరో పతకం లభించింది. టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో శుక్రవారం ఆయన ఈ పతకాన్ని సాధించాడు. దీంతో 18 ఏళ్ళ ప్రవీణ్ సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ నెంబర్ 3 ప్రవీణ్ కుమార్ సాధించిన విజయంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. 2.10 మీటర్ల జంప్‌తో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జొనాథన్ ఎడ్వర్డ్స్ బంగారు పతకం సాధించాడు.


ప్రవీణ్ పుట్టినప్పటి నుంచి ఒక కాలు పొడవు మరొక కాలు పొడవు కన్నా తక్కువగా ఉంది. ఆయన బాల్యం నుంచి క్రీడలపట్ల ఆసక్తిని ప్రదర్శించేవాడు. వాలీబాల్ ఆడటాన్ని మొదట్లో ఇష్టపడేవాడు. ఒకసారి శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారితో కలిసి హై జంప్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అప్పుడు శారీరక సామర్థ్య లోపాలుగలవారికి కూడా ప్రత్యేకంగా క్రీడా పోటీలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆయనకు డాక్టర్ సత్యపాల్ సింగ్ శిక్షణ ఇచ్చారు.  ఆయన దుబాయ్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్ FAZZA Grand Prix 2021లో బంగారు పతకం సాధించి, ఆసియా రికార్డు సృష్టించాడు. 


Updated Date - 2021-09-03T15:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising