ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యో ఒలింపిక్స్.. నేటి అప్‌డేట్స్

ABN, First Publish Date - 2021-08-03T01:17:51+05:30

ఒలింపిక్స్‌లో భారత్‌కు ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొద్దిసేపటి క్రితం జరిగిన మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్‌కు ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొద్దిసేపటి క్రితం జరిగిన మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో కమల్‌ప్రీత్ సింగ్ నిరాశ పరిచింది. 63.72 మీటర్లు మాత్రమే విసిరి ఆరో స్థానానికి పరిమితమైంది. అమెరికాకు చెందిన వి.ఆల్మన్ 68.98 దూరం విసిరి టాప్ ప్లేస్‌లో నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా, జర్మనీకి చెందిన కె.పుడెంజ్ 66.86 మీటర్లు విసిరి రజతం సాధించింది. క్యూబాకు చెందిన వై.పెరెజ్ 65.72 మీటర్లు విసిరి కాంస్య పతక విజేతగా నిలిచింది.


ఒలింపిక్స్‌ 11వ రోజైన నేడు భారత్ శుభారంభం చేసింది. భారత మహిళల హాకీ జట్టు ప్రపంచ నంబర్ 2 ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్‌లో మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. భారత జట్టు సెమీస్‌కు చేరడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. 200 మీటర్ల పరుగులో సెమీస్‌కు చేరుకోవడంలో ద్యూతీ చంద్ విఫలమైంది. ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక షూటర్లు ఐశ్వర్యప్రతాప్ సింగ్ తోమర్, సంజీవ్ రాజ్‌పుట్ ఫైనల్ రేస్‌కు అర్హత సాధించలేకపోయారు. ఈక్వెస్ట్రియన్‌లో ఫౌవాద్ మీర్జా వ్యక్తిగత జంపింగ్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. 8 పాయింట్లు గెలుచుకుని 47.20 స్కోరు చేశాడు.  

Updated Date - 2021-08-03T01:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising