ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Olympics: టోక్యో కోర్టులో షట్లర్ పీవీ సింధూ శిక్షణ ప్రారంభం

ABN, First Publish Date - 2021-07-19T16:46:58+05:30

ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్ దేశంలోని టోక్యో నగరానికి చేరుకున్న షట్లర్ పీవీ సింధూ సోమవారం ఉదయం టెన్నిస్ కోర్టులో కోచ్ పార్క్ టే సాంగ్ సమక్షంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో (జపాన్): ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్ దేశంలోని టోక్యో నగరానికి చేరుకున్న షట్లర్ పీవీ సింధూ సోమవారం ఉదయం టెన్నిస్ కోర్టులో కోచ్ పార్క్ టే సాంగ్ సమక్షంలో శిక్షణ ప్రారంభించారు.సింధూతో కలిసి మరో షట్లర్ సాయిప్రణీత్ కోర్టుకు వచ్చారు.టేబుల్ టెన్నిస్ కోర్టులో శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ లు కూడా శిక్షణ ప్రారంభించారు.పురుషుల డబుల్స్ జంట చిరాగ్ శెట్టి, సాత్విక్ సైరాజ్ లు తమ కోచ్ మాధియాస్ బోతో కలిసి శిక్షణ ప్రారంభించారు.రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధూ జులై 23 నుంచి ప్రారంభం కానున్న మహిళల సింగిల్స్ గ్రూప్ జేలో ఆడేందుకు ఎంపికయ్యారు. 


సింధూ లీగ్ వేదికపై హాంకాంగ్ కు చెందిన చెయంగ్ నాన్ యి, ఇజ్రాయెల్ కు చెందిన పోలికార్పోవాలతో తలపడనున్నారు. అంతకు ముందు భారత ఆర్చర్స్ అతనుదాస్, తరుణదీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, దీపికా కుమారిలు సోమవారం టోక్యో క్రీడానగరంలో శిక్షణకు శ్రీకారం చుట్టారు.ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు టోక్యో చేరుకున్న 88మంది భారత క్రీడాకారులకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని వచ్చింది.దీంతో సోమవారం ఉదయం పలువురు క్రీడాకారులు తమ కోచ్ లతో కలిసి క్రీడా శిక్షణలో మునిగారు.


Updated Date - 2021-07-19T16:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising