ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympic: కత్తి యుద్ధంలో భవానీదేవి అద్భుత ప్రదర్శన!

ABN, First Publish Date - 2021-07-26T17:15:37+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఫెన్సర్ భవానీ దేవి అద్భుత ప్రదర్శన చూపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఫెన్సర్ భవానీ దేవి అద్భుత ప్రదర్శన చూపారు. మొదటి రౌండ్‌లో విజయం సాధించిన ఆమె రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యారు. అయితే ఆమె క్రీడా ప్రయాణంలో ఇది మైలు రాయిగా నిలిచింది. భవానీ దేవి తొలి రౌండులో ట్యునీషియా క్రీడాకారిణి నడియా బెన్ అజిజి చేతిలో ఓటమి పాలయ్యారు. రెండో రౌండులో భవానీ.. ఫ్రాన్స్ క్రీడాకారికి మేనన్ బ్రూనెట్‌తో తలపడ్డారు. ఈ పోటీలో రైట్ ఆఫ్ వే నిబంధన ప్రకారం మేనన్ అధిక పాయింట్లు దక్కించుకుని విజయాన్ని కైవసం చేసుకున్నారు. 


భవానీ ఈ స్థాయిలో రాణించడం వెనుక ఎంతో శ్రమ దాగుంది. భవానీకి కత్తి యుద్ధంలో శిక్షణ ఇప్పించేందుకు ఆమె తల్లి తన నగలను సైతం కుదువబెట్టి మరీ డబ్బులు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ కత్తియుద్ధం పోటీలలో భవానీ బ్లాక్ కార్డు వరకూ చేరుకున్నారు. ఎనిమిది సార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన భవానీ దేవి 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాలకున్నా అది సాధ్యం కాలేదు. 


Updated Date - 2021-07-26T17:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising