ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోక్యో ఒలింపిక్స్‌ అథ్లెట్స్ గ్రామంలో మద్యపాన నిషేధం!

ABN, First Publish Date - 2021-06-10T16:12:44+05:30

టోక్యో ఒలింపిక్స్ క్రీడల అథ్లెట్స్ గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రతిపాదించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో (జపాన్): టోక్యో ఒలింపిక్స్ క్రీడల అథ్లెట్స్ గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రతిపాదించారు. 11వేల మంది ఒలింపిక్ అథ్లెట్లు, 4,400 పారా ఒలింపియన్లు ఉండే క్రీడా గ్రామంలో మద్యం నిషేధం అమలు ప్రతిపాదనలను ఒలింపిక్స్ నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో జపాన్ దేశంతోపాటు టోక్యో నగరంలో బార్ లు, రెస్టారెంట్లు మూసివేసి మద్యం విక్రయాలను నిషేధించారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో జపనీస్ ప్రజలు ఒలింపిక్స్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో మద్యనిషేధం అమలు చేయాలనే ప్రతిపాదన వచ్చినా దీనిపై నిర్ణయం తీసుకోలేదని నిర్వాహకులు అంటున్నారు. 


క్రీడా గ్రామంలోని అథ్లెట్ల ప్రైవేటు గదుల్లో మద్యం నిషేధించడం కష్టమేనని, కాని బహిరంగ ప్రదేశాల్లో మాత్రం నిషేధించవచ్చని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ సీఈవో తోషిరో ముటో చెప్పారు. క్రీడా గ్రామంలో భోజన ప్రదేశాలు,బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మద్యాన్ని నిషేధించవచ్చని తోషిరో పేర్కొన్నారు. ఒలింపిక్స్ కోసం జపాన్ దేశంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ ఇంటి నుంచి బయలుదేరే ముందు, జపాన్ చేరుకున్న తర్వాత రెండు సార్లు పరీక్షిస్తామని, 14 రోజులపాటు వారి కదిలికలను పరిమితం చేస్తామని తోషిరో వివరించారు.

Updated Date - 2021-06-10T16:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising