ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షూటింగ్‌ అయ్యో.. బాకర్‌ (5)

ABN, First Publish Date - 2021-07-26T08:51:25+05:30

షూటింగ్‌లో కచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న 19 ఏళ్ల యువ షూటర్‌ మనూ బాకర్‌ను మహిళల 100మీ. ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో దురదృష్టం వెంటాడింది. రెండో సిరీస్‌ సందర్భంగా ఆమె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షూటింగ్‌లో కచ్చితంగా పతకం సాధిస్తుందనుకున్న 19 ఏళ్ల యువ షూటర్‌ మనూ బాకర్‌ను మహిళల 100మీ. ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో దురదృష్టం వెంటాడింది. రెండో సిరీస్‌ సందర్భంగా ఆమె పిస్టల్‌ ఎలక్ర్టానిక్‌ ట్రిగ్గర్‌ పైన ఉండే కాకింగ్‌ లెవర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఏ షూటరైనా పెల్లెట్‌ను లోడ్‌ చేయాలంటే కాకింగ్‌ లేవర్‌ను వెనక్కి లాగాల్సి ఉంటుంది. తిరిగి మూశాకే షూట్‌ చేయడానికి వీలవుతుంది. కానీ బాకర్‌ పిస్టల్‌ లెవర్‌ విరగడంతో పెల్లెట్‌ను లోడ్‌ చేయడం వీలుకాలేదు. దీంతో దీన్ని రీప్లేస్‌ చేసేందుకు కోచ్‌, జ్యూరీ మెంబర్‌తో కలిసి టెస్ట్‌ టెంట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడే కీలక 20 నిమిషాల సమయం వృథా అయ్యింది. ఆ తర్వాత తను 36 నిమిషాల్లోనే 44 షాట్లను షూట్‌ చేయాల్సి వచ్చింది. ఈ విరామంతో కాస్త ఒత్తిడిని కూడా ఎదుర్కొన్న బాకర్‌ లయ తప్పింది. దీంతో ఆరు సిరీ్‌సలు పూర్తయ్యాక 575 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు దూరమైంది. అయినా కేవలం రెండు పాయింట్ల తేడాతోనే నిష్క్రమించాల్సి రావడం.. తను పోరాడిన తీరును చెబుతోంది. మరోవైపు ఇదే విభాగంలో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ యశస్విని దేస్వాల్‌ 13వ స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఇక పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో దీపక్‌ కుమార్‌, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వార్‌ 26, 32వ స్థానాల్లో నిలిచి ఇంటిముఖం పట్టారు.

Updated Date - 2021-07-26T08:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising