ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prithvi Shaw మరో గ్రహం నుంచి వచ్చాడు: ఆకాశ్ చోప్రా

ABN, First Publish Date - 2021-07-20T01:10:12+05:30

టీమిండియా ఓపెనర్ పృథ్వీషాపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అతడు మామూలు ఆటగాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: టీమిండియా ఓపెనర్ పృథ్వీషాపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అతడు మామూలు ఆటగాడు కాదని, ఈ గ్రహం వాడు అసలే కాదని ఆకాశానికెత్తేశాడు. అతడికి తాను చాలా పెద్ద ఫ్యాన్‌నని చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో నిన్న జరిగిన తొలి వన్డేలో పృథ్వీషా ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. దొరికిన బంతిని దొరికినట్టు చితకబాదాడు. 24 బంతుల్లోనే 43 పరుగులు చేసి అవుటయ్యాడు. అతడి అద్భుత ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


తాజాగా, తన యూట్యూబ్ చానల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పృథ్వీ షా లాంటి ఆటగాడు ఈ దేశంలోనే లేడని తేల్చి చెప్పాడు. ‘‘పృథ్వీషా మరో గ్రహం నుంచి వచ్చాడు. నేను అతడికి పెద్ద ఫ్యాన్‌ను. అతడి లాంటి బ్యాట్స్‌మన్ దేశంలోనే ఎవరూ లేరు’’ అని పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నప్పటికీ, పృథ్వీషా ఒక్క చెమట చుక్క కూడా చిందించకుండా, ఎలాంటి చాన్స్ తీసుకోకుండా 24 బంతుల్లో 43 పరుగులు బాదేశాడని ప్రశంసల వర్షం కురిపించాడు. షా ఎంత గొప్ప ఆటగాడో అని కితాబిచ్చాడు. నిజానికి ఇది అతడి సంవత్సరమేనన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ నుంచి ఐపీఎల్, ఇప్పటి వరకు అతడి అద్భుత ప్రదర్శన కొనసాగుతోందని చోప్రా వివరించాడు.

Updated Date - 2021-07-20T01:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising