ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్వీటు తెచ్చిన చేటు

ABN, First Publish Date - 2021-06-08T06:15:41+05:30

అనాలోచిత ట్వీట్‌లు.. కాలసర్పాల్లా కాటేశాయి. అరంగేట్రం ఆనందం ఆస్వాదించకుండానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2012 నాటి జాతి విద్వేష పోస్ట్‌తో రాబిన్‌సన్‌పై వేటు


లండన్‌: అనాలోచిత ట్వీట్‌లు.. కాలసర్పాల్లా కాటేశాయి. అరంగేట్రం ఆనందం ఆస్వాదించకుండానే ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్‌ ఒలీ రాబిన్‌సన్‌ను ఇంటికి  పంపాయి. గతంలో చేసిన జాతి వివక్ష, లైంగిక వ్యాఖ్యలకారణంగా రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. న్యూజిలాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్ట్‌కు అతడు అందుబాటులో ఉండడని స్పష్టం చేసింది.


2012-13లో ఒలీ చేసిన వివాదాస్పద ట్వీట్‌లపై విచారణ చేయనున్నట్టు తెలిపింది. టీనేజర్‌గా ఉన్నప్పుడు నల్లజాతీయులు, మహిళలు, ఆసియా వాసులను కించపరిచే విధంగా అతడు ట్వీట్లు చేశాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 27 ఏళ్ల రాబిన్‌సన్‌ అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టడంతోపాటు తొలి ఇన్నింగ్స్‌లో 42 రన్స్‌ చేసి బ్యాట్‌తోనూ రాణించాడు. అయితే, తొలిరోజు మ్యాచ్‌లో ఒలీ బరిలోకి దిగిన తర్వాత ఆ ట్వీట్‌ల స్ర్కీన్‌ షాట్లు బయటకు రావడంతో దుమారం రేగింది.


‘ఓ మతానికి చెందిన తన గాళ్‌ ఫ్రెండ్‌ బాంబ్‌’ అని రాబిన్‌సన్‌ ఓ ట్వీట్‌ చేయగా.. మరోసారి ‘ఫలానా మతంవాళ్లు ఉగ్రవాదులు అని’ రాశాడు. ‘ఈస్ట్‌ ఆసియా వాసుల ముఖాలు ఇలా ఉంటాయి’ అని కించపరిచే విధంగా ఓ ఎమోజినీ రాబిన్‌సన్‌ పోస్టు చేశాడు. అయితే, ఇవన్నీ అప్పట్లో తెలియక చేశాననీ.. తనను క్షమించాలని రాబిన్సన్‌ కోరాడు.  


Updated Date - 2021-06-08T06:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising