ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్‌ ప్రారంభ సంరంభం

ABN, First Publish Date - 2021-07-11T08:00:32+05:30

కరోనాతో ఏడాది వాయిదా పడిన టోక్యో-2020 ఒలింపిక్స్‌కు ఈనెల 23న తెరలేవనుంది. వచ్చేనెల ఎనిమిది వరకు జరిగే మెగా ఈవెంట్‌లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయంత్రం 4.25 నుంచి ..

ఒలింపిక్స్‌ 12రోజుల్లో..


టోక్యో: కరోనాతో ఏడాది వాయిదా పడిన టోక్యో-2020 ఒలింపిక్స్‌కు ఈనెల 23న తెరలేవనుంది. వచ్చేనెల ఎనిమిది వరకు జరిగే మెగా ఈవెంట్‌లో 33 క్రీడాంశాల్లో 205 దేశాలకు చెందిన అథ్లెట్లు తలపడుతున్నారు. ప్రారంభ కార్యక్రమం ఈ నెల 23న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.25కి మొదలు కానుంది. ఈ సందర్భంగా జపాన్‌ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశాల పరేడ్‌తోపాటు ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటాయి. భారత్‌లో ఈ కార్యక్రమాలను సోనీ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.. 


భారత బృందానికి క్రికెటర్ల శుభాకాంక్షలు

ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత అథ్లెట్లకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు దేశ ప్రజలంతా భారత క్రీడాకారులకు నైతిక మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈమేరకు బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. మిథాలీరాజ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రహానె, హర్మన్‌ప్రీత్‌, జెమీమా, హర్లీన్‌ తదితరులు ‘చీర్‌ ఫర్‌ ఇండియా’ అంటూ భార త బృందానికి విషెస్‌ చెప్పారు. ‘టోక్యో బరిలో దిగుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని మోదీతో కలిసి బీసీసీఐ కూడా మద్దతు పలుకుతోంది. మన క్రీడాకారులకు అండగా నిలుద్దాం’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. 

Updated Date - 2021-07-11T08:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising