ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా గ్రామం ఆరంభం

ABN, First Publish Date - 2021-07-14T08:22:56+05:30

ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. అత్యయిక స్థితిలోనూ ఒలింపిక్‌ క్రీడా గ్రామాన్ని మంగళవారం ఆరంభించారు. ఈ నెల 23న మెగా ఈవెంట్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒలింపిక్స్‌ 9రోజుల్లో


టోక్యో: ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. అత్యయిక స్థితిలోనూ ఒలింపిక్‌ క్రీడా గ్రామాన్ని మంగళవారం ఆరంభించారు. ఈ నెల 23న మెగా ఈవెంట్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. క్రీడా గ్రామంలో ఉండే ప్రతి అథ్లెట్‌కు ప్రతీ రోజూ కొవిడ్‌ పరీక్షలు చేస్తారు. వారికి కేటాయించిన వసతి భవనం నుంచి బయటకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చిన తర్వాత ఇలా రెండుసార్లు తప్పనిసరిగా టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా ప్రొటోకాల్‌ను తప్పని సరిగా పాటించాల్సిందే. అందరూ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, కిటికీలు తెరిచేలా పదేపదే సూచనలు చేయనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు 11,000 మంది, పారాలింపిక్స్‌కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్‌ ఆగస్టు 24 నుంచి జరగనున్నాయి.  


జిమ్నాస్టిక్స్‌లో తొలి భారత జడ్జి కబ్రా

ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌ ఈవెంట్లలో జడ్జిగా వ్యవహరించే అవకాశం దక్కించుకున్న తొలి భారతీయుడిగా దీపక్‌ కబ్రా నిలిచాడు. మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల దీపక్‌.. 2005 నుంచి 2009 వరకు జిమ్నాస్టిక్స్‌ స్టేట్‌ చాంపియన్‌గా నిలిచాడు. జిమ్నా్‌స్టగా అత్యున్నత ప్రమాణాలు అందుకోలేనని గుర్తించిన దీపక్‌.. జడ్జ్‌ కోర్సు చేసి అందులోనే కెరీర్‌ వెతుక్కున్నాడు. 

Updated Date - 2021-07-14T08:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising