ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనా, శ్రీకాంత్‌ ముందంజ

ABN, First Publish Date - 2021-01-14T10:03:15+05:30

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో పీవీ సింధు తొలిరౌండ్లోనే ఓడి నిరాశపరిచినా.. మరో ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ శుభారంభం చేసి మహిళల సింగిల్స్‌లో భారత ఆశలను సజీవంగా ఉంచింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • థాయ్‌లాండ్‌ ఓపెన్‌
  • డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ బోణీ

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో పీవీ సింధు తొలిరౌండ్లోనే ఓడి నిరాశపరిచినా.. మరో ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ శుభారంభం చేసి మహిళల సింగిల్స్‌లో భారత ఆశలను సజీవంగా ఉంచింది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ ముందంజ వేసింది. బుధవారం జరిగిన మొదటిరౌండ్లో సైనా 21-15,21-15తో మలేసియాకు చెందిన సెల్వాదూరె కిసోనాపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-12, 21-11తో భారత్‌కే చెందిన సౌరభ్‌ వర్మను ఓడించి రెండోరౌండ్‌ చేరాడు. మరో మ్యాచ్‌లో ప్రత్యర్థి జాసన్‌ ఆంథోనీ హో షూ (కెనడా) 21-9, 13-21, 14-8తో ఆధిక్యంలో ఉన్నప్పుడు పారుపల్లి కశ్యప్‌ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. సమీర్‌ వర్మ 15-21, 17-21తో షెసార్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 19-21, 21-16, 21-14తో కొరియా జంట కిమ్‌ గి జంగ్‌-లీ యంగ్‌పై గెలిచి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. 

Updated Date - 2021-01-14T10:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising