ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దస్‌ కా దమ్‌

ABN, First Publish Date - 2021-05-17T10:01:10+05:30

టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నడాల్‌ తనకచ్చొచ్చిన ఎర్రమట్టిలో దుమ్మురేపాడు. ఈ స్పెయిన్‌ బుల్‌ ఇటాలియన్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడాల్‌ ఖాతాలో పదో ఇటాలియన్‌ టైటిల్‌

 ఫైనల్లో జొకోవిచ్‌పై విజయం


రోమ్‌: టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నడాల్‌ తనకచ్చొచ్చిన ఎర్రమట్టిలో దుమ్మురేపాడు. ఈ స్పెయిన్‌ బుల్‌ ఇటాలియన్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నడాల్‌ 7-5, 1-6, 6-3తో ప్రపంచ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. గత ఫ్రెంచ్‌ఓపెన్‌ ఫైనల్లో జొకోను చిత్తుచేసిన నడాల్‌.. తాజా గెలుపుతో ఈసారీ క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌ ఫేవరెట్‌నని చాటిచెప్పాడు. రికార్డుస్థాయిలో పన్నెండోసారి ఫైనల్‌ చేరిన నడాల్‌కిది పదో ఇటాలియన్‌ ఓపెన్‌ ట్రోఫీ కావడం విశేషం. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే నడాల్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన ఆధిక్యంలోకి దూసుకెళ్లిన జొకో.. అదే జోరులో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.


అయితే, రఫా నెమ్మదిగా పుంజుకొన్నాడు. 2-3తో వెనుకబడిన సమయంలో.. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన రఫా 3-3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా పోరాడడంతో ఆధిక్యం చేతులు మారుతూ 5-5తో సమమైంది. అయితే, వరుసగా రెండు గేమ్‌లు నెగ్గిన రఫా 7-5తో తొలి సెట్‌ను సొంతం చేసుకొన్నాడు. రెండో సెట్‌లో మాత్రం పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన నొవాక్‌ 6-1తో నెగ్గాడు. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో 4-2తో పైచేయి సాధించిన రఫా.. అదే జోరులో 6-3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొన్నాడు. 


వావ్‌.. సియాటెక్‌:

పోలెండ్‌ టెన్నిస్‌ తార, ఫ్రెంచ్‌ ఓపెన్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా సియాటెక్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సియాటెక్‌ 6-0, 6-0తో 9వ సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను చిత్తుగా ఓడించింది. ఎంతలా అంటే.. ప్రత్యర్థికి కనీసం ఒక్క గేమ్‌కు కూడా అవకాశమివ్వకుండా చెలరేగింది. 19 ఏళ్ల సియాటెక్‌కు ఇది మూడో డబ్ల్యూటీఏ టైటిల్‌. 

Updated Date - 2021-05-17T10:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising