ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొతేరా మనదే.. టీమిండియా ఘన విజయం

ABN, First Publish Date - 2021-02-26T01:29:24+05:30

మొతేరా స్టేడియంలో మోత మోగిపోయింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. రెండు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి నుంచీ ఆధిపత్యం చెలాయించింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: మొతేరా స్టేడియంలో మోత మోగిపోయింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. రెండు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి నుంచీ ఆధిపత్యం చెలాయించింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌కు దారుణ ఓటమి తప్పలేదు. ఒక పక్క నుంచి అక్షర్ పటేల్(5 వికెట్లు), మరో పక్క నుంచి అశ్విన్(4 వికెట్లు) ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశారు. దీంతో సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిపత్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు కుప్ప కూలిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం తీసేయగా ఇంగ్లండ్ కేవలం 48 పరుగులు మాత్రమే ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 7.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 



Updated Date - 2021-02-26T01:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising