ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి టీ20లో ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..

ABN, First Publish Date - 2021-03-13T02:20:36+05:30

ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఇంగ్లండ్ ముందు 125 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో మొత్తంగా 7 వికెట్లను కోల్పోయిన భారత్.. 124 పరుగులు మాత్రమే చేసింది. ప్రధానంగా బ్యాట్స్‌మెన్ వైఫ్యల్యంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: తొలి టీ20లో ఇంగ్లండ్ ముందు టీమిండియా 125 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో మొత్తంగా 7 వికెట్లను కోల్పోయిన భారత్.. 124 పరుగులు మాత్రమే చేసింది. ప్రధానంగా బ్యాట్స్‌మెన్ వైఫ్యల్యంతో ఒకానోక దశలో టీమిండియా 100 పరుగులు దాటితే చాలనే పరిస్థితి ఏర్పడింది. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్(67) అర్థసెంచరీతో మెరవడంతో ఈ పరుగులైనా చేయగలిగింది. ఇక భారత బౌలర్లు ఈ స్కోరును డిఫెండ్ చేయగలుగుతారో లేదో చూడాలి.


ఇదిలా ఉంటే తొలి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), శిఖర్ ధవన్(4) వరుస ఓవర్లలో అవుట్ కావడం, కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) మళ్లీ దారుణంతా విఫలం కావడం జట్టుపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఇక రిషబ్ పంత్(21) కొంత సేపు మెరుపులు మెరిపించినా స్టోక్స్ వేసిన స్లో బాల్‌‌కు దొరికిపోయాడు. మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడబోయి బెయిర్ స్టోకు చిక్కాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా(19) కూడా కొద్ది సేపటికే అవుట్ కావడం, ఆ తరువాతి బంతికే శార్దూల్ ఠాకూర్(0) కూడా అవుట్ కావడంతో కేవలం 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో అయ్యర్ కూడా సిక్స్ కొట్టబోయి థర్డ్ మ్యాన్ వద్ద డేవిడ్ మలాన్‌కు దొరికిపోయాడు. 

Updated Date - 2021-03-13T02:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising