ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీసీఐ ప్రతిపాదనకు ఇంగ్లండ్ ఒప్పుకుంటుందా?

ABN, First Publish Date - 2021-05-08T18:23:17+05:30

ప్రస్తుతం భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉంది. ఈ కారణంగానే ఐపీఎల్ కూడా అర్ధంతరంగా రద్దయిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్ర స్థాయిలో ఉంది. ఈ కారణంగానే ఐపీఎల్ కూడా అర్ధంతరంగా రద్దయిపోయింది. కోహ్లీ సేన జూన్‌ 18-22 మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆడాల్సి ఉంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ జరుగుతుంది.


ఇందుకోసం భారత జట్టు ఈనెల మూడో వారంలో ఇంగ్లండ్‌ వెళ్లి క్వారంటైన్‌లో ఉండనుంది. నిబంధనల ప్రకారం ఇంగ్లండ్‌లో భారత జట్టు రెండు వారాలు తప్పనిసరిగా కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే. సహచర ఆటగాళ్లను కూడా కలిసేందుకు వీలుండదు. ఈ విషయంలో ఇంగ్లండ్‌ను సడలింపులు కోరాలని బీసీసీఐ భావిస్తోంది. ఒక వారం మాత్రమే క్వారంటైన్‌ ఉండేలా అనుమతించాలని బోర్డు కోరనుంది. ఇంగ్లండ్ వెళ్లే ముందు భారత్‌లోనే వారం రోజుల పాటు ప్రత్యేక బయో బబుల్‌లో ఆటగాళ్లను ఉంచాలని అనుకుంటోంది. మరి, ఈ ప్రతిపాదనకు అనుమతి లభిస్తోందో, లేదో చూడాలి. గత డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు సిడ్నీలో టీమిండియా సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నా కలిసి ఆడుకునేందుకు అనుమతినిచ్చారు. 

Updated Date - 2021-05-08T18:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising