ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్యూతీకి ధనలక్ష్మి షాక్‌

ABN, First Publish Date - 2021-03-17T09:24:54+05:30

భారత మహిళల వంద మీటర్ల రేసులో స్టార్‌ అథ్లెట్‌గా నీరాజనాలందుకుంటున్న ఒడిశా స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌కు తమిళనాడు అమ్మాయి ధనలక్ష్మి షాకిచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటియాలా: భారత మహిళల వంద మీటర్ల రేసులో స్టార్‌ అథ్లెట్‌గా నీరాజనాలందుకుంటున్న ఒడిశా స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌కు తమిళనాడు అమ్మాయి ధనలక్ష్మి షాకిచ్చింది. ఇక్కడ మంగళవారం మొదలైన ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 22 ఏళ్ల ధనలక్ష్మి 100 మీటర్ల రేసులో విజేతగా నిలిచింది. ఫైనల్లో ద్యూతీ చంద్‌ (11.58 సెకన్లు)ను రజతానికి పరిమితం చేస్తూ ధనలక్ష్మి 11.39 సెకన్లలో రేసు ముగించి స్వర్ణ పతకం అందుకుంది. అర్చనా సుశీంద్రన్‌ (11.76 సె) కాంస్యం గెలుచుకుంది. ఇక, ఎప్పుడూ 400 మీటర్ల రేసులో పరిగెత్తే హిమాదాస్‌ ఈసారి వంద మీటర్లలో పోటీపడ్డా నిరాశే ఎదురైంది. ఫాల్స్‌ స్టార్ట్‌ చేయడంతో ఆమె రేసు నుంచి అనర్హతకు గురైంది.


Updated Date - 2021-03-17T09:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising